బెడ్‌పై కదల్లేని స్థితిలో బిగ్‌బాస్ బ్యూటీ... శైలజా ప్రియకి ఏమైంది?

తెలుగునాట క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరిగా దూసుకెళ్తున్నారు నటి ప్రియ. సినిమాలతో పాటు బుల్లితెరపైనా సత్తా చాటి దూసుకెళ్తున్నారు. 45 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని అందాలతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. ఈ వయసులోనూ టెక్నాలజీ, సోషల్ మీడియా, ఫ్యాషన్ ఇలా అన్ని రకాలుగా అప్‌డేట్‌గా ఉంటున్నారు. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమేనని ప్రియ నిరూపిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన ప్రియ పూర్తి పేరు.. మామిళ్ల శైలజా ప్రియ. హైదరాబాద్‌లో చదువుకున్న ఆమె కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తితో అటువైపు అడుగులు వేశారు. తొలుత మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ ఆమె తొలి సినిమా. ఎక్కువగా హీరోయిన్‌లకు ఫ్రెండ్ క్యారెక్టర్స్, ఇతర క్యారెక్టర్ రోల్స్‌లో అలరించారు ప్రియ. చిన్నా చితకా పాత్రలు వచ్చినా సరే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌ను ప్లాన్ చేసుకున్నారు. రాజకుమారుడు, గోకులంలో సీత, కత్తి కాంతారావు, మిర్చి, సన్నాఫ్ సత్యమూర్తి, రారండోయ్ వేడుక చూద్దాం సహా కెరీర్‌లో దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించారు శైలజా ప్రియ.

Bigg Boss fame Shailaja Priya Shares Injury Photo Says She Is on Bed Rest

2002లో మాచిరాజు వెంకట కిశోర్‌ను పెళ్లి చేసుకున్నారు శైలజ ప్రియ.. ఈ దంపతులకు నిశ్చయ్ అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లి తర్వాత భర్త, కుమారుడు, కుటుంబం కోసం కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్నారు ప్రియ. సినిమాలే కాదు.. ఆ రోజుల్లోనే తెలుగు బుల్లితెరై సీరియల్స్‌లో ఏకధాటిగా నటించారు. ఈ దశలో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి సంచలనం సృష్టించారు ప్రియ. ఈ వయసులోనూ కుర్రాళ్లతో పోటీపడి టాస్క్‌లు, గేమ్‌లలో దూకుడుగా వ్యవహరించారు. దాదాపు 7 వారాల పాటు హౌస్‌లో ఉండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్నారు. బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఆమెను మరింత పాపులర్ చేసింది. జెన్ జీ జనరేషన్‌కు దగ్గర చేసి మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లలో బిజీగా ఉన్నారు శైలజా ప్రియ. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన సినిమాలు, షూటింగ్, ఇతర వ్యక్తిగత వివరాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. మహిళలు, సమానత్వం గురించి ఎక్కువగా పోస్టులు పెడుతూ పలు అంశాలపై అవగాహన కల్పిస్తుంటారు. వీలు కుదిరినప్పుడల్లా కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడుపుతారు. అర్ధరాత్రి పూట కారులో స్నేహితులతో లాంగ్ డ్రైవ్‌కు వెళ్తుంటారు. తాజాగా శైలజా ప్రియ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

బెడ్‌పై కాలికి పెద్ద కట్టుతో ఉన్న ఫోటోను ఆమె షేర్ చేశారు. కానీ ఆ గాయం ఎలా అయ్యిందన్న దానిపై మాత్రం ప్రియ క్లారిటీ ఇవ్వలేదు. అది చూస్తుంటే మాత్రం గాయం పెద్దగానే అయినట్లుగా ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. అధికారికంగా ఇక బెడ్‌పై విశ్రాంతే.. ఇలాంటి సమయంలో మీ ప్రేమ నాకు కావాలి, కాస్త గుడ్ వైబ్స్ ఉండాలి, నాకు గాయం తగ్గేవరకు నా మైండ్‌ని బిజీగా పెట్టాలి అంటూ రాసుకొచ్చారు ప్రియ. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా అభిమానులు, సినీ ప్రముఖులు .. ప్రియ త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+