బాక్సాఫీస్‌ను షేక్ చేసే కాంబో... మహేష్ బాబు -ప్రశాంత్ నీల్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ ప్రశాంత్ నీల్ కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌ను ఊపేస్తోంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉండబోతోందని ఫిలింనగర్ సర్కిల్స్‌లో గట్టిగా ప్రచారం సాగుతోంది.
స్టోరీ లైన్ ఓకే - కథా చర్చలు షురూ!
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్‌కు సంబంధించిన ప్రాథమిక చర్చలు ఇప్పటికే ముగిశాయి. ప్రశాంత్ నీల్ చెప్పిన బేసిక్ ఐడియాకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, దర్శకుడు ప్రస్తుతం పూర్తి స్థాయి కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు.. మహేష్ బాబు ఇంటెన్స్ యాక్టింగ్, స్టైలిష్ లుక్‌తో తోడైతే వెండితెరపై పూనకాలు ఖాయమని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

భారీ ప్రాజెక్టులతో బిజీగా ఇద్దరూ
ఈ ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అంతర్జాతీయ అడ్వెంచరస్ మూవీ 'వారణాసి' షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా జూనియర్ ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' చిత్రంతో పాటు, ప్రభాస్‌తో 'సలార్ 2' లైన్‌అప్‌ను పూర్తి చేయాల్సి ఉంది. ఈ భారీ కాంబినేషన్లు పూర్తయిన తర్వాతే ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ విజువల్ వండర్‌ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం. మైత్రీ మూవీస్ అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినప్పటికీ, ఈ ఊహాగానాలే సోషల్ మీడియాలో సూపర్ స్టార్ అభిమానులను పండగ చేసుకునేలా చేస్తున్నాయి.














Click it and Unblock the Notifications
