నయనతార-ధనుష్ వివాదం నేపథ్యంలో మహేష్‌బాబు పోస్ట్

లేడీ సూపర్ స్టార్ నయనతార, ధనుష్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. నయనతార జీవితకథ విశేషాలతో నెట్ ఫ్లిక్స్ సంస్థ 'బియాండ్ ది ఫేయిరీ టేల్' పేరుతో డాక్యుమెంటరీని రూపొందించి విడుదల చేసింది. ఈనెల 18వ తేదీ నుంచి ఇది ప్రసారమవుతోంది. ఇలా డాక్యుమెంటరీ చేసినందుకు నయనతార ఖాతాలో కోట్లరూపాయలు వచ్చిపడ్డాయి. అందులో విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. పెళ్లి సమయంలో వాటిని వీరిద్దరూ బయటకు రానివ్వలేదు. ఇప్పుడు డాక్యుమెంటరీ రూపంలో నెట్ ఫ్లిక్స్ ద్వారా క్యాష్ చేసుకున్నారు.

కోర్టులో తేల్చుకోనున్న ధనుష్
ఈ డాక్యుమెంటరీలో నయనతార - ధనుష్ మధ్య జరుగుతున్న వివాదాన్ని కూడా చూపించారు. బియాండ్ ది ఫేయిరీ టేల్ కు మంచి స్పందన వస్తోంది. తన సినిమాకు సంబంధించిన విజువల్స్ ను వాడుకోవడంపై రూ.10 కోట్లు చెల్లించాలంటూ ధనుష్ నయనతారకు లీగల్ నోటీసు పంపించాడు. దీనిపై నయనతార బహిరంగంగా ధనుష్ కు లేఖ రాసింది. ఆ లేఖలో అతనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రస్తుతం వీరిమధ్య వివాదం ఇలాగే కొనసాగుతోంది. అయితే ధనుష్ మౌనంగా ఉండటానికి కారణం న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నాడని తెలుస్తోంది. కోర్టుద్వారానే తేల్చుకుందామని, సోషల్ మీడియాలో అనవసరంగా రచ్చ చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంలో ధనుష్ ఉన్నాడంటున్నారు. అయితే న్యాయస్థానంలో ధనుష్ నే విజయం వరించే అవకాశం ఉందని, నయనతారకు కోర్టు మొట్టికాయలు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Mahesh Babu instagram post on Nayanthara s documentary

డాక్యుమెంటరీపై స్పందించిన మహేష్ బాబు
తాజాగా తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ డాక్యుమెంటరీపై స్పందించారు. తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఆసక్తికరంగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. డాక్యుమెంటరీ చూసిన ప్రిన్స్ మూడు రెడ్ లవ్ సింబల్స్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధనుష్, నయనతార మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మహేష్ బాబు పోస్ట్ షేర్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. మహేష్ బాబు - నయనతార కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. గతంలో వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందేమోనని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారుకానీ వారి కోరిక నెరవేరలేదు. భవిష్యత్తులో కూడా నెరవేరే అవకాశం లేదు. ప్రస్తుతం రాజమౌళితో కలిసి మూడు సంవత్సరాలు ప్రయాణం చేయబోతున్నాడు ప్రిన్స్. ఆ తర్వాత ఏ సినిమా చేస్తాడు? ఎవరితో చేస్తాడు? అనేది అప్పుడు తెలుసుకోవడమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+