అనిల్ రావిపూడి సినిమాలో మహేష్-మమిత జోడీ? అసలు నిజం ఏంటి?

సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానుల్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ జోష్ నింపుతోంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' పూర్తయిన తర్వాత మహేష్ బాబు తన తదుపరి సినిమాను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. సక్సెస్‌ఫుల్ కమర్షియల్ ట్రాక్ రికార్డు ఉన్న అనిల్ రావిపూడితో మహేష్ బాబు కాంబినేషన్ అనగానే టాలీవుడ్‌లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

నాని 'పారడైజ్’కు మళ్లీ బ్రేక్? రిలీజ్ డేట్‌పై సస్పెన్స్!
నాని 'పారడైజ్’కు మళ్లీ బ్రేక్? రిలీజ్ డేట్‌పై సస్పెన్స్!

అనిల్ రావిపూడి క్లారిటీ
రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసిన తర్వాత కథానాయకులు వరుస ఫ్లాపులను ఎదుర్కొంటారనే సెంటిమెంట్ సినిమా ఇండస్ట్రీలో ప్రచారంలో ఉంది. 'వారణాసి' లాంటి భారీ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి లాంటి పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ అందించే దర్శకుడితో సినిమా చేస్తే ఆ సెంటిమెంట్‌ను సులభంగా అధిగమించవచ్చని అభిమానులు భావించారు. అయితే ఈ వార్తలపై డైరెక్టర్ అనిల్ రావిపూడి తక్షణమే స్పందించారు. మహేష్ బాబుతో సినిమా వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేస్తూ రూమర్లను వ్యాప్తి చేయవద్దని కోరారు.

Mahesh Babu Next After Varanasi Anil Ravipudi and Mamitha Baiju Movie Rumors Truth Out Details

కొత్త ప్రచారం.. మమితా బైజు పేరు తెరపైకి!
దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చినా కూడా ఈ కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో చర్చలు ఆగడం లేదు. కోలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో 'జనవరి 12 విడుదల' సినిమా చిత్రీకరణలో ఉంటూనే మరో కొత్త స్క్రిప్ట్ పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజును కథానాయికగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మహేష్-అనిల్ కాంబినేషన్ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉండటం వల్లే మేకర్స్ బయటకు చెప్పడం లేదని అభిమానులు విశ్లేషిస్తున్నారు.

పక్కా హిట్ సినిమా గురు..అదిరిపోయిన టీజర్
పక్కా హిట్ సినిమా గురు..అదిరిపోయిన టీజర్

సమయం మాత్రమే సమాధానం చెప్పాలి..
ప్రస్తుతానికి సూపర్ స్టార్ మహేష్ బాబు పూర్తి దృష్టంతా రాజమౌళి 'వారణాసి' పైనే ఉంది. అనిల్ రావిపూడి కూడా తన ముందస్తు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే 'వారణాసి' లాంటి భారీ అడ్వెంచర్ డ్రామా తర్వాత మహేష్ రిలాక్సింగ్‌గా ఉండే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ చేయడానికి మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఇవి కేవలం ప్రచారాలుగానే ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగా పట్టాలెక్కుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+