మహేష్ బాబు - రాజమౌళి ‘వారణాసి’ టార్గెట్.. రూ.10వేల కోట్లు.. రాసిపెట్టుకోండి!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. ప్రియాంక చోప్రా కథానాయికగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ సుమారు రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కేవలం పాన్-ఇండియా స్థాయిలోనే కాకుండా, ఒక గ్లోబల్ ప్రాజెక్ట్‌గా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను రూపుదిద్దుతున్నారు.
భారీ ప్రచార ప్లాన్.. మార్కెట్ విస్తరణ
షూటింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి, దసరా నాటికి టాకీ పార్ట్ ముగించాలని రాజమౌళి ప్రణాళికలు రచిస్తున్నారు. ఏడాది చివరినాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి, ఆ తర్వాత నాలుగు నెలల పాటు ప్రపంచవ్యాప్తంగా అపూర్వ రీతిలో ప్రమోషన్లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. భారతదేశంలో దాదాపు 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ, చిత్రాలను థియేటర్లలో చూసేవారి సంఖ్య కేవలం ఒక శాతం మాత్రమే ఉంటోంది. ఆ శాతాన్ని కొద్దిగా పెంచగలిగినా వసూళ్లు మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటాయని రాజమౌళి భావిస్తున్నారు.

పదివేల కోట్ల జోస్యం
ఈ సినిమాపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'వారణాసి' చిత్రం కేవలం వెయ్యి కోట్లతో సరిపెట్టుకోదని, రూ.10,000 కోట్ల భారీ వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుని రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. మొదట్లో వంద కోట్లు, ఆ తర్వాత ఐదు వందల కోట్లతో 'బాహుబలి' తీసినప్పుడు రాజమౌళి నిర్ణయాన్ని చాలామంది శంకించినా, ఆయన విజయాన్ని సాధించి చూపించారని గుర్తుచేశారు.
'ఆర్‌ఆర్‌ఆర్'తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి నమ్మకానికి తిరుగులేదని, 'వారణాసి' చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 సినిమాల జాబితాలో నిలవడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ దర్శకులు, నిర్మాతలు కూడా రాజమౌళి వారణాసి కోసం ఎదురుచూస్తున్నారని, ఒడిస్సీ లాంటి సినిమాలే కాదని, భారత్ నుంచి వెళ్లే వారణాసి లాంటి సినిమాలు కూడా వేలకోట్ల రూపాయలు కొల్లగొడతాయని నిరూపించే సమయం దగ్గర పడిందని భరద్వాజ అన్నారు.












Click it and Unblock the Notifications