ఆస్కార్ బ‌రిలో అధికారిక ఎంట్రీ ఇచ్చిన మ‌ల‌యాళ మూవీ..

ఆస్కార్ 2024 బ‌రిలోకి మ‌ల‌యాళ చిత్రం 2018 అధికారికి ఎంట్రీ ఇచ్చింది. కేర‌ల వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్ర‌మే 2018. మ‌ల‌యాళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని భార‌తీయ ప్రాంతీయ భాష‌ల్లోనూ విడుద‌ల అయ్యింది. అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. సినిమా ఆద్యంతం భావోద్వేగ స‌న్నివేశాల‌తో సాగుతుంటుంది. ఆస్కార్ బ‌రిలోకి ఈ చిత్రం భార‌త‌దేశం నుంచి అధికారికంగా ఎంట్రీ ఇచ్చిన‌ట్లు తాజాగా తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 96వ ఆస్కార్ ఈవెంట్ 2024 మార్చి 10న ఆదివారం జరగనుంది. లాస్ ఏంజిల్స్‌లోని ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్ లో గ్రాండ్ గా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ ప్రాంతాలలో ABC ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

వంద కోట్ల రూపాయ‌లకు పైగా వ‌సూలు..:ఈ సినిమాకు ప్రేక్ష‌కుల్లో మంచి ఆద‌ర‌ణను పొందింది. ఈ సినిమాలోని కొన్ని ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు ఆద్యంతం ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసాయి. మ‌రికొన్ని స‌న్నివేశాలైతే ప్రేక్ష‌కుల‌తో ఏకంగా క‌న్నీళ్లు పెట్టించేసాయి. ఆడియోన్స్ సినిమాకు బాగా క‌నెక్ట్ అవ్వ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద‌కూడా మంచి రిజ‌ల్ట్ అందుకుంది. రూ.100 కోట్ల‌కు పైగా వ‌సూలళ్ల‌ను రాబ‌ట్టింది ఈ చిత్రం. చిన్నా సినిమా, పెద్ద సినిమా కాదు, అందులో ఉన్న కంటెంట్ ముఖ్య‌మని మ‌రోసారి ఈ సినిమాతో రుజువ‌య్యింది.

Malayalam flick 2018 Gives official entry to Oscars

అంత‌గా ఈ సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించారు. చిన్న సినిమాగా వ‌చ్చి సంచ‌ల‌నంగా మారింది. అమీర్ ఖాన్ 'లగాన్' చిత్రం తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమా ఆస్కార్ బరిలో చివరి వరకు నిలవలేదు. అంతకు ముందు 'మదర్ ఇండియా', 'సలామ్ బాంబే' వంటి చిత్రాలు మాత్రమే ఈ అవార్డు కోసం పోటీ పడ్డాయి. ఆ త‌ర్వాత ఇప్ప‌డు 2024 ఆస్కార్ బ‌రిలో భార‌త్ నుంచి ఉత్త‌మ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అధికారిక ఎంట్రీని దక్కించుకుందని దర్శకుడు గిరీష్ కాసర్లవల్లి నేతృత్వంలోని జ్యూరీ ప్రకటించింది. ఈ సినిమాకు ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించారు. టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించారు. అపర్ణ బాలమురళీ, కుంచావో బోబన్, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, నరేన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

గ‌తేడాది ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్‌..:గతేడాది ఇండియాకు రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డు దక్కిన విషయం అంద‌రికీ తెలిసిందే. రామ్ చరణ్ - ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' మూవీ సాంగ్ 'నాటు నాటు'కు అవార్డు దక్కింది. బెస్ట్ ఓరిజినల్ సాంగ్ కేటగిరీలో ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డును అందుకున్నారు. అలాగే డాక్యుమెంటరీ సిరీస్ 'ఎలిఫెంట్ విష్పర్స్'కు అవార్డు దక్కింది. ఇక గతేడాది గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో' విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్స్ కు అధికారిక ఎంట్రీ ఇచ్చింది. కానీ చివ‌రివ‌రకు అది నిలవలేకపోయింది. ఈ క్రమంలో మలయాళ చిత్రం 2018 ఎలాంటి పోటినిస్తుందో చూడాలి.

Malayalam flick 2018 Gives official entry to Oscars

చెన్నై వేదికగా ఆస్కార్ ఎంట్రీ కోసం ఆస్కార్ కమిటీ దరఖాస్తులు స్వీకరించింది. కాసరవల్లి గిరీష్ అధ్యక్షతన ప‌దిహేడు మంది సభ్యులతో కమిటీ దరఖాస్తులను స్వీకరించింది. మొత్తం 22 సినిమాలను కమిటీ చూసింది. అఫిషియ‌ల్ ఎంట్రీకీ ఇర‌వై రెండు భార‌తీయ సినిమాలు పోటీప‌డ‌గా, జ్యురీ 2018 మ‌ల‌యాళం చిత్రాన్ని ఎంపిక చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+