pushpa2: ఫస్ట్‌టైం 'పుష్ప2' టీంకు శుభాకాంక్షలు చెప్పిన మెగా హీరో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కలెక్షన్లు భారీగా కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలంతా అల్లు అర్జున్ నటనకు ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమాపై మొదటి నుంచి మాట్లాడకుండా ఉంది ఎవరంటే మెగా కుటుంబం అని చెప్పొచ్చు. మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు కొన్నాళ్లు ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. అసలే వివాదాలుంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవి మరింత ముదిరి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి చేరుకున్నాయి.

బన్నీకి ట్యాగ్ చేసిన సాయిధరమ్ తేజ్
సినిమా విడుదలవుతున్న సందర్భంగా అందరూ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్పడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే మెగా కుటుంబం నుంచి మాత్రం ఎవరూ స్పందించడంలేదు అనుకుంటున్న తరుణంలో మెగా హీరోల్లో ఒకరైన సాయిధరమ్ తేజ్ స్పందించారు. పుష్ప2 చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపాడు. సినిమా బ్లాక్ బస్టర్ కావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ కు, సుకుమార్ కు, దేవిశ్రీప్రసాద్ కు, మరికొందరికీ ట్యాగ్ చేశాడు. దీనికి అల్లు అర్జున్ స్పందించి సాయిధరమ్ తేజ్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సినిమా నీకు నచ్చుతుందని నును భావిస్తున్నాను తేజూ అని తిరిగి సమాధానం ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ కు ఉన్న విభేదాలకు తాత్కాలికంగానైనా స్వస్తి పలికినట్లైందని అభిమానులు భావిస్తున్నారు.

mega hero saidharamtej wishes to pushpa2 team and allu arjun

అభిమానులతో సినిమా చూసిన బన్నీ
పుష్ప2 ప్రీమియర్ షోను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య ధియేటర్ లో అభిమానులతో కలిసి అల్లు అర్జున్ చూశాడు. వారినుంచి వచ్చిన స్పందనకు సంతోషించాడు. ఈ సందర్భంగా ఓ దుర్ఘటన జరిగింది. అల్లు అర్జున్ వస్తున్నాడని అభిమానులంతా తోసుకోవడంతో 35 సంవత్సరాల వయసున్న రేవతి అనే మహిళ మరణించగా, తొక్కిసలాటకు గురైన ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన అక్కడ అందరినీ కలిచివేసింది. సినమా టికెట్ల బుకింగ్ ద్వారా రూ.100 కోట్ల గ్రాస్ రాగా, తొలిరోజు రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+