మెగా ఇంట్లో పెళ్లిబాజాలు.. హీరోయిన్ తో మెగా హీరో పెళ్లి?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ (దుర్గ) తేజ్ ఇటీవలే విరూపాక్ష సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తన నటనతో, వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. గతంలో జరిగిన ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత విరూపాక్షతో ఘనవిజయం సాధించాడు. గతేడాది సత్య అనే ఫీచర్ ఫిల్మ్ విడుదల చేసి అందులో కూడా విజయం దక్కించుకున్నాడు. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.
పరిశ్రమకు వచ్చిన మొదట్లో తేజ్ కు చాలామంది హీరోయిన్లతో సంబంధాలున్నాయంటూ వార్తలు వచ్చాయి. తర్వాత అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. తాజాగా ఆయన హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె మరెవరో కాదు.. రెజీనా కసాండ్రా. ఇద్దరూ ప్రేమలో మునిగినట్లు గతంలో కూడా వార్తలు వచ్చాయి. అయితే ఏకంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబుతున్నారంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ బాగా వైరలవుతోంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలా ట్విస్ట్ ఇచ్చి పెళ్లి చేసుకుంటారంటూ కామెంట్లు పెడుతున్నారు.

సాయి దుర్గతేజ్ పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాతో సైమా అవార్డును గెలుచుకున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తర్వాత వచ్చిన చిత్రలహరి, ప్రతిరోజు పండగే, సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్ సినిమాలతో తన నటనను నిరూపించుకున్నాడు. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా విరూపాక్ష నిలిచింది. ఇటీవలే తన పేరు సాయి ధరమ్ తేజ్ కు బదులుగా సాయి దుర్గతేజ్ అని మార్చుకున్నాడు. దుర్గ అంటే వాళ్ల అమ్మ పేరు. చిరంజీవి మేనల్లుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి నెమ్మదిగా తన స్టామినాను నిరూపించుకుంటూ వస్తోన్న సాయిదుర్గ తేజ్ రెజీనాను పెళ్లి చేసుకోబోతున్నాడని తెలియగానే మెగా అభిమానులు ఆనందంతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications