మధ్యలోనే ఆగిపోయిన మెగాస్టార్ చిరంజీవి సినిమాలు
ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ యాక్టర్ గా తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో సుప్రీంహీరోగా మారారు. అక్కడి నుంచి మెగాస్టార్ అయ్యారు. తన కుటుంబం నుంచి మరో నలుగురిని హీరోలుగా పరిచయం చేసి ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్నారు. అయితే మెగాస్టార్ గా కొనసాగుతున్న తరుణంలో కూడా సినిమాలు క్లాప్ కొట్టుకొని అనివార్య కారణాలవల్ల ఆగిపోయిన సినిమాలున్నాయనే విషయం చాలామందికి తెలియదు. చిరంజీవి సినిమాలు మధ్యలో ఆగిపోవడం ఏమిటనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. ఆ సినిమాలు ఏమిటనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని షూటింగ్ జరుపుకున్న తర్వాత ఆగిపోగా, మరికొన్ని సెట్స్ పైకి రాలేదు. ఇంకొన్ని మాత్రం సెట్స్ పైకి వచ్చి ఆగిపోయాయి.
సురేష్ కృష్ణతో చేయాల్సిన సినిమా
ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణతో భాషా సినిమా తర్వాత చిరంజీవి హాలీవుడ్ సినిమా చేయాల్సి ఉంది. అబూ బాగ్దాద్ గజదొంగ పేరుతో ఈ సినిమా ప్రారంభమైందికానీ ఇందులో ఓ మతానికి సంబంధించిన పుస్తకంపై వివాదం తలెత్తింది. ఈ వివాదాన్ని నిర్మాతలు సరిగా పరిష్కరించలేకపోయారు. వీరు పరిశ్రమకు కొత్తవారు. దీంతో ఆ ప్రాజెక్టు అలా ఆగిపోయింది.

సింగీతం శ్రీనివాసరావుతో
బాలయ్యతో భైరవ ద్వీపం, ఆదిత్య 369 లాంటి బ్లాక్ బస్టర్లు, ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ తీసిన సింగీతం శ్రీనివాసరావుతో ఓ సినిమా చేయాలని చిరంజీవి భావించారు. దీన్ని జానపద చిత్రంగా అశ్వనీదత్ నిర్మాతగా వైజయంతీ మూవీస్ బ్యానరుపై తీయాలనుకున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చేయడానికి ముందే ఈ సినిమా చేయానలుకున్నారు. భూలోకవీరుడు పేరుతో సినిమా పేరు రిజిస్టర్ చేయించారు. అయితే ఎందుకనో కారణాలు తెలియదుకానీ సినిమా సెట్స్ పైకి రాలేదు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో
అశ్వనీదత్ నిర్మాతగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఊర్మిళ, టబు హీరోయిన్లు కాగా కొంత షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే అదే సమయంలో సంజయ్ దత్ జైలు నుంచి విడుదల కావడంతో తనతో సినిమా చేయడానికి ఈ సినిమాను మధ్యలో వదిలేసి వర్మ వెళ్లిపోయాడు. రెండు పాటలు కూడా తీశారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక చూడాలని వుంది సినిమా వందరోజులు పూర్తిచేసుకున్న తర్వాత ఈ రెండు పాటలను ఆ సినిమాకు యాడ్ చేశారు.












Click it and Unblock the Notifications