తెలుగు స్టార్ హీరోల చూపు అక్కడే
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడానికి అగ్ర నిర్మాణ సంస్థలన్నీ పోటీపడేవి. దిల్ రాజు వెంకటేశ్వర క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్, సురేష్ ప్రొడక్షన్స్.. లాంటి బ్యానర్లన్నీ పోటీపడేవి. అయితే కొద్ది సంవత్సరాలుగా తెలుగు సినీరంగంలో ఓ నిర్మాణ సంస్థ తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. దక్షిణాదిలోని అన్ని సినీ పరిశ్రమలో టాప్ బ్యానర్ గా ఎదగడమేకాదు.. బాలీవుడ్ లో కూడా ఎదిగి ఇండియాలో టాప్ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకోవడానికి అడుగులు ముందుకు వేస్తోంది.
హీరోల కాల్షీట్లు వారిదగ్గరే
దీంతో సహజంగానే స్టార్ హీరోలంతా ఆ నిర్మాణ సంస్థలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. హీరోలందరి కాల్షీట్లు ఆ సంస్థ చేతిలోనే ఉన్నాయి. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి భాగస్వామ్యంలో రూపుదిద్దుకున్న సంస్థే మైత్రీ మూవీ మేకర్స్. విజయాలతో సంబంధం లేకుండా వీరు సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థ ధాటికి మిగతా హీరోల కాల్షీట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం దిల్ రాజు గేమ్ ఛేంజర్ ఒక్కటే తీస్తున్నారు. గీతా ఆర్ట్స్ కూడా మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు నిర్మిస్తోంది.

అన్నీ రూ.400 కోట్ల బడ్జెట్ లోనే
మైత్రీ మూవీస్ ప్రస్తుతం ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో నిర్మిస్తున్న చిత్రం బడ్జెట్ రూ.500 కోట్లు. బ్రిటీష్ నేపథ్యంలో పీరియాడిక్ వార్ డ్రామాగా రాబోతోంది. అలాగే అల్లు అర్జున్ తో పుష్ప2 నిర్మిస్తున్నారు. దీనికి పెట్టిన బడ్జెట్ రూ.400 కోట్లు అని తెలుస్తోంది. డిసెంబరు ఆరోతేదీన ఇది విడుదల కాబోతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమాను వీరే నిర్మిస్తున్నారు. దీనికి కూడా రూ.400 కోట్ల బడ్జెట్ అని తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. దీని బడ్జెట్ రూ.150 కోట్లు. అలాగే రామ్ చరణ్ 16వ సినిమాను కూడా మైత్రీ మూవీసే నిర్మిస్తోంది. ఈ చిత్రం బడ్జెట్ కూడా రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల మధ్యలో ఉంటుందంటున్నారు. నితిన్ తో తమ్ముడు చిత్రాన్ని రూ.70 కోట్లతో, తమిళంలో అజిత్ తో సినిమా, బాలీవుడ్ లో సన్నీడియోల్ తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థే నిర్మిస్తోంది.












Click it and Unblock the Notifications