Puri: పూరీ రథయాత్ర కోసం విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు- షెడ్యూల్, హాల్ట్ లు ఇవే..!
ఈ నెల 16న ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్ర (Rath Yatra)కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రథయాత్రను చూసేందుకు దేశ,విదేశాల్లోని భక్తులు తరలివస్తుంటారు. దీంతో పూరీ కిక్కిరిసిపోతుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటిలాగే ఈసారి కూడా దక్షిణ కోస్తా రైల్వే విశాఖపట్నం (Visakhapatnam)- పూరీ (Puri) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటికి సంబంధించిన వివరాలను ఇవాళ అధికారులు విడుదల చేశారు. ఇందులో ఈ రైళ్ల షెడ్యూల్, హాల్ట్ లు, ఇతర వివరాలు ఉన్నాయి.
పూరీ రథయాత్ర నేపథ్యంలో విశాఖపట్నం నుంచి పూరీకి, అలాగే పూరీ నుంచి తిరిగి విశాఖకు భక్తులు రాకపోకలు సాగించే విధంగా దక్షిణ కోస్తా రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. విశాఖపట్నం నుంచి పూరీకి ప్రత్యేక రైళ్లు (08551)ను ఈ నెల 15, 23 తేదీల్లో నడుపుతోంది. అలాగే పూరీ నుంచి విశాఖకు కూడా ప్రత్యేక రైళ్లు (08552)ను ఈ నెల 17, 25 తేదీల్లో నడుపుతోంది. సంప్రదాయ రూట్ ఖుర్దారోడ్ జంక్షన్ మీద నుంచి కాకుండా ఈ రైళ్లు అరుగుల్, హరిపూర్ గ్రామ్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

విశాఖపట్నంలో ఈ నెల 15, 23 తేదీల్లో మధ్యాహ్నం 12.30కు బయలుదేరే ప్రత్యేక రైలు సింహాచలం, కొత్త వలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్, తిలారు, కోటబొమ్మాళి, నౌపడ, పలాస, మందస, సోంపేట, ఇచ్చాఫురం మీదుగా వెళ్తూ.. మరుసటి రోజు ఉదయం 9.30కు పూరీకి చేరుకుంటుంది. అలాగే పూరీ నుంచి ఈ నెల 17, 25 తేదీల్లో తెల్లవారుజామున 2.30కు బయలుదేరే రైళ్లు ఉదయం 11.05కు విశాఖకు చేరుకుంటాయి. ఒక్కో రైలులో 12 కోచ్ లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.














Click it and Unblock the Notifications