పూరీ జగన్నాథుడి రథయాత్ర తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు దుర్మరణం

అత్యంత వైభవంగా కొనసాగుతున్న పూరీ జగన్నాథుడి రథయాత్రలో మరోసారి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. 50 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సంఘటన స్థలానికి చేురుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

ఈ తెల్లవారు జామున పూరీలోని గుండిచా ఆలయానికి సమీపంలో గల శారదబలి వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. మృతులను ప్రభాతి దాస్, బసంతి సాహు, ప్రేమకాంత మొహంతిగా గుర్తించారు. ఈ ముగ్గురు కూడా ఖుర్దా జిల్లాకు చెందిన భక్తులు. జగన్నాథుడి రథయాత్రను తిలకించడానికి తొలి రోజే పూరీకి చేరుకున్నారు.

3 dead several injured in stampede near Gundicha Temple during Puri Jagannath Rath Yatra

ఈ తెల్లవారు జామున 4:20 నిమిషాల ప్రాంతంలో జగన్నాథుడు తన తోబుట్టువులతో కొలువుదీరిన సమయంలో దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో గుమిగూడటం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఈ ముగ్గురూ దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, పోస్టుమార్టం కోసం పంపామని పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ ఎస్ స్వైన్ తెలిపారు.

స్వామివారికి అలంకరించాల్సిన చరమాలతో కూడిన రెండు ట్రక్కులు శారదబలి ఆలయానికి సమీపించినప్పుడు తొక్కిసలాటు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. చరమాలను జగన్నాథుడికి అలంకరించడాన్ని తిలకించాలనే ఉద్దేశంతో భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారని చెబుతున్నారు.

ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి మోహన్ మాఝి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు హామీ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి రథయాత్ర ప్రారంభంలో జాప్యం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ వివాదం చెలరేగింది. బిజూ జనతాదళ్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ జాప్యం గందరగోళానికి దారి తీసిందని పేర్కొన్నారు.

భక్తులను క్రమబద్దీకరించడానికి ఒడిశా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పోలీసులు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించినప్పటికీ- ఈ తొక్కిసలాట చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రత్యేకించి- శారదబలి వంటి కీలకమైన పాయింట్ల వద్ద భక్తులను నియంత్రించడంలో సిబ్బంది విఫలం అయ్యారనే విమర్శలు వ్యక్తమౌతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+