"ఉదయనిధి అరెస్టు వెనుక అసలు కుట్ర..?" విజయ్ సర్కార్ పై స్టాలిన్ షాకింగ్ ..!

నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఇవాళ తమిళనాడు విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో వదిలిపెట్టడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) ఈ ఘటనలపై తీవ్రంగా స్పందించారు. అసమర్థుడైన, నామమాత్రపు ముఖ్యమంత్రి అంటూ విజయ్ పై నిప్పులు చెరిగారు.

స్టాలిన్ కు రాహుల్ కీలక పిలుపు..! డీలిమిటేషన్ బిల్లు వేళ కీలక పరిణామం..!
స్టాలిన్ కు రాహుల్ కీలక పిలుపు..! డీలిమిటేషన్ బిల్లు వేళ కీలక పరిణామం..!

విజయ్ కావేరీ నీటిని తీసుకురాలేకపోయారని, కనీసం మేకెదాటు ఆనకట్ట నిర్మాణాన్ని అడ్డుకునేలా గళం కూడా విప్పలేకపోయారని, రైతులు బాధతో కన్నీరు మున్నీరు అవుతుంటే, మంత్రులు, ముఖ్యమంత్రి మాత్రం ఆయన నటించిన సినిమా గురించి ఏడుస్తున్నారని స్టాలిన్ విమర్శించారు. తమిళనాడులో ఒక 'జోకర్ క్యాబినెట్' అధికారాన్ని చేజిక్కించుకుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కావేరీ సమస్యపై ప్రభుత్వ ఘోర వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి, ప్రజల దృష్టిని ఆ సమస్య నుండి మళ్లించడానికి, ఈ ఉదయం ప్రతిపక్ష నేత ఉదయనిధి నివాసానికి భారీ పోలీసు బలగాలు చేరుకుని, అత్యంత దురుసుగా ఆయన్ని అరెస్టు చేశాయన్నారు.

MK Stalin Accuses Vijay Government of Diverting Attention From Cauvery Issue With Udhayanidhi Arrest

ప్రతిపక్ష నాయకుడిగా ఉదయనిధికి ఉన్న హోదాను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసి హడావిడిగా తంజావూరుకు తరలించిందన్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం ద్వారా ఉదయనిధిని భయపెట్టాలని వారు ప్రయత్నిస్తున్నారన్నారు. రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో క్యాబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడు సభలో హాజరు కాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందన్నారు.డీఎంకే కార్యకర్తలు, ప్రజల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వ న్యాయవాది ఉదయనిధిని అరెస్టు చేసే ఉద్దేశం లేదు, విచారణ తర్వాత విడుదల చేస్తామన్నారని గుర్తుచేశారు.

MK Stalin Accuses Vijay Government of Diverting Attention From Cauvery Issue With Udhayanidhi Arrest
సుప్రీం మెట్లెక్కిన విజయ్..! కర్ణాటకతో ఇక తాడో పేడో..!
సుప్రీం మెట్లెక్కిన విజయ్..! కర్ణాటకతో ఇక తాడో పేడో..!

నిజంగా విచారణ జరపడమే లక్ష్యం అయితే చెన్నైలోనే దాన్ని ఎందుకు చేయకూడదని స్టాలిన్ ప్రశ్నించారు. ఆయన్ని తంజావూరుకు ఎందుకు తరలించాలన్నారు. బెయిల్ లభించకుండా అడ్డుకునేలా అనేక సెక్షన్ల కింద కేసులు ఎందుకు నమోదు చేయాలన్నారు. ప్రజా వ్యతిరేకత ముందు వెనక్కి తగ్గిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఉదయనిధిని ఈ రోజే విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశం ఫాసిస్ట్ ధోరణులకు గట్టి దెబ్బగా నిలిచిందన్నారు. అధికారం చేపట్టినప్పటి నుండి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేయడానికి బదులుగా, కేవలం 'రీల్స్ క్రియేటర్'గా తిరగడానికే పరిమితమైన ముఖ్యమంత్రి విజయ్, ఇకనైనా తన బాధ్యతలను గుర్తించి తదనుగుణంగా వ్యవహరించాలన్నారు. నిరసనల్లో పాల్గొన్నందుకు తమిళనాడులో అరెస్టు అయిన డీఎంకే కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని స్టాలిన్ డిమాండ్ చేసారు. అహంకారం వినాశనానికి దారితీస్తుందని, మొండి అహంకారం వినాశనాన్ని వేగవంతం చేస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+