బయటపడ్డ నాగ చైతన్య- శోభిత ధూళిపాళ పెళ్లి అగ్రిమెంట్..?
అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళతో నాగ చైతన్య రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. నాగ చైతన్య- శోభిత కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో వీరు డేటింగ్‌లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరు అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చారు.
ఈక్రమంలోనే నాగ చైతన్య , శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ ..నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్ణమని తెలిపింది.పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది.ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది.

పెళ్లికి ముందు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఓ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. నాగార్జుననే ఈ అగ్రిమెంట్ రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం..భవిష్యత్తులో ఏదైనా కారణాలతో వీరిద్దరూ విడిపోవాల్సి వస్తే ఆస్తిలో సగం వాటా (భరణం) కింద ఇవ్వడం కుదరదని నాగార్జున ముందుగానే ఈ అగ్రిమెంట్ చేయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది.పొరపాటున వీరిద్దరు ఏవైనా కారణాలతో విడిపోవాల్సి వస్తే అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన ఆస్తి నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం కుదరదని ముందుగానే నాగార్జున తేల్చిచెప్పేశారట.
నాగచైతన్య సంపాదించిన ఆస్తిలో మాత్రమే భరణం కింద ఎంత చెల్లించాల్సి ఉంటుందో అది మాత్రమే నీకు చెందుతుందని ఓ అగ్రిమెంట్ చేయించి నాగ చైతన్య, శోభిత ధూళిపాళ సంతకాలు తీసుకున్నారట నాగార్జున. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications