అవకాశాల కోసం దర్శకులను పర్సనల్‌గా డీల్ చేస్తా
నేహాశెట్టి అంటే గుర్తు పడతారో లేదో కానీ..రాధిక అంటే మాత్రం సినీ అభిమానులందరూ కూడా ఠక్కున గుర్తు పడతారు. తెలుగు ఇండస్ట్రీలో రాధిక పేరుకు ఓ బ్రాండ్ ఉంది. ఒకే ఒక సినిమాతో నేహాశెట్టి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. సిద్దు జోన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌గా నటించింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టించిందో అందరికి తెలిసిందే.
ముఖ్యంగా నేహాశెట్టి అందాలకు యూత్ అంతా ఫిదా అయ్యారు. నేహాశెట్టి చేసిన రాధిక క్యారెక్టర్‌కు అభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు. టిల్లు స్వ్కేర్‌లో గెస్ట్ రోల్‌లో నటించి అభిమానులను అలరించింది. నేహాశెట్టి ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తోంది. విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నేహాశెట్టి పలు ఆసక్తకర అంశాలను అభిమానులతో పంచుకుంది.

తాజాగా ఇంటర్వ్యూలో నేహాశెట్టి తెలుగులో అవకాశాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కొన్నిసార్లు హీరోయిన్లని వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయి. కానీ ప్రతిసారి అలా జరగదు.అలాంటి సమయంలో డైరెక్టర్లతో తప్పనిసరిగా టచ్ లో ఉండాలి. నేను వాళ్ళకి ఫోన్ చేసి అవకాశం అడుగుతా. అందులో తప్పులేదు. ఎందుకంటే ఒక చిత్రంలో నటించేందుకు మనం ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నామో వాళ్ళకి తెలియాలంటే మనమే చెప్పాలి.
జస్ట్ ఆఫర్ ఇవ్వమని అడగడం వేరు.. ఈ చిత్రానికి నేను బాగా సరిపోతాను నేను యాక్ట్ చేయగలను అని చెప్పడం వేరు ఇక్కడ వందలమంది అమ్మాయిలు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. నేను డైరెక్టర్లకు ఫోన్ చేసి.. సర్ మీరు ఈ చిత్రం చేస్తున్నారని తెలిసింది. మీ కథకి నేను న్యాయం చేస్తానని అనిపిస్తే నన్ను కన్సిడర్ చేయండి అని రిక్వస్ట్ చేస్తా. అందులో తప్పు లేదు కదా అని నేహా శెట్టి తెలిపింది. ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో నేహా శెట్టి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి












Click it and Unblock the Notifications