Obsession Movie: ఈ సినిమాను థియేటర్స్ లో అస్సలు మిస్ అవ్వొద్దు..!

కంటెంట్ ఈజ్ కింగ్ అని ఈ రోజుల్లో చాలా సినిమాలు నిరూపిస్తున్నాయి. ఇటీవలికాలంలో చిన్న సినిమాల హవా పెరిగిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా హాలీవుడ్ వరకూ దాదాపు కంటెంట్ ఉన్న అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగులోనూ ఇటీవలి కాలంలో కోర్ట్, రాజు వెడ్స్ రాంబాయి, లిటిల్ హార్ట్స్, శంభాల, ఫ్రెండ్లీ కపుల్ తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. కథలో దమ్ము ఉంటే చాలు అది చిన్న సినిమానా..? లేక పెద్ద సినిమానా..? ప్రేక్షకులు చూడరు అని చాలాసార్లు రుజువైంది.

అయితే ఇటీవలి కాలంలో ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీని కేవలం రూ. 9 కోట్ల బ‌డ్జెట్ తో తెరకెక్కించారు. కానీ బాక్సాఫీస్ వద్ద రూ. 2,240 కోట్ల వసూళ్లు సృష్టించింది. అంటే పెట్టిన ఖర్చుకు ఏకంగా 10000 శాతం కంటే ఎక్కువ లాభాలను ఆర్జించి ట్రేడ్ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. యూట్యూబ్ క్రియేటర్ కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 15 న విడుదలైంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా విజయవతంగా ప్రదర్శితం అవుతోంది.

ఇటు హైదరాబాద్ లోనూ అబ్సెషన్ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. కేవలం మౌత్ టాక్ తోనే ఈ మూవీకి హైదరాబాద్ లో థియేటర్లు అమాంతం పెంచేశారు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే బేర్ అనే యువకుడు ఓ మ్యూజిక్ షాపులో పనిచేస్తుంటాడు. అయితే బేర్.. అదే షాపులో పనిచేసే నిక్కీ అనే యువతిని ప్రేమిస్తాడు. కానీ ఆ విషయం ఆమెకు చెప్పేందుకు చాలా భయపడిపోతాడు. ఓ రోజు వన్ విష్ అని పేరున్న ఓ వస్తువును కొనుగోలు చేస్తాడు. దాన్ని విరగ్గొట్టి నిక్కీ తనను ప్రేమించాలని బలంగా కోరుకుంటాడు.

Obsession Creates Global Storm 9 Crore Budget Hollywood Film Rakes in 2 240 Crore Obsession

అయితే బేర్ ఊహించని విధంగా అతని కోరిక నెరవేరుతుంది. నిక్కీ.. బేర్ ను ప్రేమిస్తుంది. దాంతో అప్పటి వరకూ ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఆ తర్వాత ఏం జరిగింది..? చివరికి ఏం జరిగింది..? అనేదే స్టోరీ లైన్.. కేవలం గంటా 45 నిమిషాలు మాత్రమే ఉన్న ఈ మూవీ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఊపేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+