India vs Pakistan: మరో ఇండియా-పాక్ మ్యాచ్..! హ్యండ్ షేక్ పై కెప్టెన్ క్లారిటీ..!
చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మధ్య మరో అంతర్జాతీయ మ్యాచ్ కు సర్వం సిద్దమైంది. ఇవాళ సాయంత్రం ఎడ్జ్‌బాస్టన్‌లో పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ తో భారత్ తమ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ప్రయాణాన్ని ప్రారంభించనుంది. పాకిస్తాన్ పై ఉన్న సుదీర్ఘ ఆధిపత్యాన్ని కొనసాగించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్న భారత మహిళల జట్టుకు ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్ తో హ్యాండ్ షేక్ ఇవ్వాలా వద్దా అనే విషయంలో టెన్షన్ నెలకొంది.
గత ఏడాది పహల్గాం దాడులు, ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన పురుషుల ఆసియా కప్ నుంచి, పురుషుల, మహిళల జట్ల క్రీడాకారులు ఇద్దరూ పాకిస్థాన్‌తో సంప్రదాయ హ్యాండ్ షేక్ కు దూరంగా ఉంటున్నారు. మహిళల ప్రపంచ కప్, అండర్-19 ప్రపంచ కప్, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్, పురుషుల టీ20 ప్రపంచ కప్‌తో సహా పలు టోర్నమెంట్లలో ఇదే విధానం కొనసాగింది. ఇప్పుడు వరల్డ్ కప్ లో మరోసారి కెప్టెన్ హర్మన్ ప్రీత్ అదే పద్దతి కొనసాగిస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

దీనిపై స్వయంగా హర్మన్ ప్రీత్ సింగ్ వివరణ ఇచ్చింది. "మేము ఇక్కడికి వచ్చింది క్రికెట్ కోసమే, కాబట్టి క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుతాము. క్రికెట్ తప్ప వేరే దేని గురించి మాట్లాడము, దాని గురించి ఆలోచించము కూడా. మొదటి రోజు నుంచీ క్రికెట్ ఆడటమే మా కల, మేము దాని గురించే చర్చిస్తాము. రేపటి మ్యాచ్‌ను కూడా మేము ఆడబోయే మరో సాధారణ మ్యాచ్‌గానే భావిస్తున్నాము," అని హర్మన్‌ప్రీత్ తేల్చేసింది. పాక్ తో మ్యాచ్ లో ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుందని, వారితో ఆడేటప్పుడు ఒత్తిడి ఉంటుందని తాను గతంలోనూ చెప్పానని గుర్తుచేసింది. కానీ అదే సమయంలో, ఆ ఒత్తిడిని ఎలా ఆస్వాదిస్తామన్నదే ముఖ్యమని తెలిపింది. ఎందుకంటే ఏ అంతర్జాతీయ మ్యాచ్‌లోనైనా ఒత్తిడి సహజం, ఆ మ్యాచ్‌లో మన వంద శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించడం, ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం మాత్రమే ముఖ్యమని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications