శ్రీశైలంలో భక్తుల రద్దీ - దర్శనాల పై కీలక నిర్ణయాలు..!!
శ్రీశైలం భక్తులకు బిగ్ అలర్ట్. వారాంతపు సెలవులు కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చారు దీంతో.. భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సిఫారసు లేఖలతో వచ్చే వారికి కూడా శ్రీ స్వామి అమ్మవారి అలంకార దర్శనం మాత్రమే అనుమతిస్తున్నారు. క్యూలైన్లో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూసేందుకే స్పర్శ దర్శనం రద్దు చేస్త కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భారీ తరలి వచ్చారు. భక్తుల రద్దీ కారణంగా అధికారులు ఆదివారం విరామ బ్రేక్ దర్శనాలు నిలుపుదల చేశారు. సిఫారసు లేఖలతో వచ్చే వారికి కూడా శ్రీ స్వామి అమ్మవారి అలంకార దర్శనం మాత్రమే అనుమతిస్తున్నారు. ఇప్పటికే మనమిత్ర,వాట్సాప్ ఆన్లైన్లో,స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారికి నిర్దిష్ట వేళల్లో స్పర్శ దర్శనానికి అనుమతినిస్తున్నారు. దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఆలయ అధికారుల నిర్ణయాలు
ఇదే సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా శని,ఆది, సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమ అర్చనలు నిలుపుదల చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. కాగా, శ్రీశైలంమల్లికార్జున స్వామి వారి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తు న్నారు.దీంతో ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉచిత, శీఘ్ర,అతిశీఘ్ర,దర్శనాల క్యూలైన్ల ద్వారా భారీగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. క్యూలైన్ల నిర్వహణను నిరంతరం భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ పాలక మండలి వెల్లడించింది. ఇక.. రద్దీ సమయాల్లో నూ సామాన్యులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. రద్దీ వేళ.. ఆలయ పాలక వర్గం తీసుకొనే నిర్ణయాలకు సహకరించాలని కోరుతున్నారు.













Click it and Unblock the Notifications