క్వార్టర్ తాగిన కోతి.. వైన్ షాప్ ఓనర్‌కు షాకిచ్చిన వానరం: VIRAL VIDEO

"కల్లు తాగిన కోతిని కంట్రోల్ చేయడం ఎవరివల్ల కాదు" అంటారు. మరి అదే కోతి ఏకంగా క్వార్టర్ తాగితే పరిస్థితి ఎలా ఉంటుంది? జనరేషన్ మారుతోంది, మనుషులు ట్రెండ్‌కు తగ్గట్టు మారుతున్నారు. ఇప్పుడు మనుషులతో పాటు జంతువులు కూడా సరికొత్తగా ఆలోచిస్తున్నాయో ఏమో కానీ, కడుపుతో ఉన్న ఒక ఆడ కోతి నేరుగా వైన్ షాపులోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ షాపులోని వోడ్కాబాటిల్‌ను తన పళ్లతో కొరికి తెరిచి మరీ గటగటా తాగేసింది. ఆ తర్వాత ఏం జరిగిందనే ఆసక్తికరమైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని ఓర్మాంజి ప్రాంతంలో బ్లాక్ చౌక్ సమీపంలో ఉన్న ఒక వైన్ షాపులో ఈ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా షాపులోకి ప్రవేశించిన ఆ ఆడ కోతి, నేరుగా కౌంటర్ వద్ద ఉన్న మద్యం సీసాలపై కన్ను పడింది. వెంటనే ఒక సీసాని తన చేతిలోకి తీసుకుని, పళ్లతో దాని మూతను బలంగా కొరికి ఓపెన్ చేసింది. ఇదంతా గమనించిన చుట్టుపక్కల స్థానికులు, జనం ఏం జరుగుతుందో అర్థంకాక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.

Monkey Enters Ranchi Liquor Shop Drinks Alcohol And Falls Unconscious Viral Video Sparks Reactions

తల్లి శవంపైనే నిద్రపోయిన పిల్ల కోతి! హార్ట్ టచింగ్ వీడియో
తల్లి శవంపైనే నిద్రపోయిన పిల్ల కోతి! హార్ట్ టచింగ్ వీడియో

ఆ కోతి కొద్దిసేపట్లోనే ఆ మద్యం తాగి ఫుల్లుగా మత్తులోకి వెళ్లిపోయింది. ఆ కిక్కు తలకెక్కిన వెంటనే ఆ వానరం షాపులోనే స్పృహతప్పి పడిపోయింది. ఈ హడావుడిలో షాపులోని మరికొన్ని మద్యం సీసాలు కూడా పగిలిపోయినట్లు తెలుస్తోంది. ఉదయం వచ్చి షాపు తెరిచిన యజమానికి లోపల కోతి మత్తులో పడి ఉండటం చూసి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. మత్తు దిగే వరకు ఆ వానరం వైన్ షాపులోనే పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాన్ని కదిలించేందుకు భయపడిన షాపు యజమాని, స్థానికులు.. దానికి మత్తు దిగేంత వరకు దాన్ని అలాగే వదిలేయాలని నిర్ణయించుకున్నారు.

వామ్మో.. కోతి ధర ఇన్ని లక్షలా? ఆకాశాన్నంటుతున్న డిమాండ్.. కారణం ఇదే!
వామ్మో.. కోతి ధర ఇన్ని లక్షలా? ఆకాశాన్నంటుతున్న డిమాండ్.. కారణం ఇదే!

ఈ మొత్తం ఉదంతానికి సంబంధించిన దృశ్యాలను ఓ కస్టమర్ మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కోతి షాపు లోపల మద్యం తాగుతూ, ఆ తర్వాత స్పృహ కోల్పోయి పడి ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అరుదైన ఘటనను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మంచి నీళ్లు అనుకుని వోడ్కా తాగి ఉండవచ్చని మరి కొందరు సమర్థిస్తున్నారు. జంతువులు మానవ ఆవాసాలలోకి వచ్చినప్పుడు ఎలాంటి వింత చేష్టలకు పాల్పడతాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+