దసరా, దీపావళికి 102 స్పెషల్ రైళ్లు.. రేపటి నుంచే రిజర్వేషన్లు స్టార్ట్

రానున్న పండగలకు ఇంటికి వెళ్లాలనుకునే ప్రయాణికులకు పండగ వేళ రైల్వే శాఖ చల్లటి కబురు చెప్పింది. దసరా, దీపావళి పండగల సీజన్‌లో రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉండటంతో.. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సోలాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ మార్గాల్లో ఏకంగా 102 ప్రత్యేక రైలు ట్రిప్పులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ అదనపు సర్వీసుల ద్వారా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు ప్రయాణ సౌలభ్యం మరింత పెరగనుంది.

ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో భాగంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), చెన్నై బీచ్ మధ్య వీక్లీ స్పెషల్ రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు రెండు దిక్కులా కలిపి మొత్తం 12 ట్రిప్పులు (ఆరు చొప్పున) సేవలు అందిస్తాయి. ముంబై నుంచి అక్టోబర్ 14 నుంచి నవంబర్ 18 వరకు, తిరుగు ప్రయాణంలో చెన్నై నుంచి అక్టోబర్ 15 నుంచి నవంబర్ 19 వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణ మార్గంలో దాదర్, పూణే, సోలాపూర్, రాయచూర్, గుంతకల్లు, రేణిగుంట తదితర కీలక స్టేషన్లలో ఈ రైళ్లకు హాల్టింగ్ ఉంటుంది.

Indian Railways Announces 102 Special Train Trips For Dussehra And Diwali Connecting Major Cities
 కాకినాడ, నర్సాపురం కు దసరా ప్రత్యేక రైళ్లు - డేట్స్, రూట్, టైమింగ్స్..!!
కాకినాడ, నర్సాపురం కు దసరా ప్రత్యేక రైళ్లు - డేట్స్, రూట్, టైమింగ్స్..!!

ముంబై - లాతూర్, కోల్హాపూర్ - కలబురగి ప్రత్యేక సర్వీసులు

ఇక ముంబై సీఎస్‌ఎంటీ నుంచి లాతూర్ మధ్య బై-వీక్లీ ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు. ఈ సర్వీసులు అక్టోబర్ 13 నుంచి నవంబర్ 24 మధ్య ప్రతి మంగళవారం, గురువారాల్లో రెండు వైపులా మొత్తం 26 ట్రిప్పుల పాటు అందుబాటులో ఉంటాయి. అలాగే, ఈ స్పెషల్ ట్రైన్లలో అత్యధికంగా కోల్హాపూర్ - కలబురగి రూట్లోనే ఏకంగా 64 ట్రిప్పులను కేటాయించారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 15 వరకు శుక్రవారాలు మినహా మిగతా అన్ని రోజుల్లోనూ ఈ డైలీ స్పెషల్ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.

Dussehra Holidays: ఏపీలో దసరా సెలవుల ప్రకటన- ఈసారి బోనస్ గా మరో 2..!
Dussehra Holidays: ఏపీలో దసరా సెలవుల ప్రకటన- ఈసారి బోనస్ గా మరో 2..!

సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న రిజర్వేషన్లు

ఈ పండగ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన ముందస్తు రిజర్వేషన్లు సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్, రైల్‌వన్ యాప్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ కేంద్రాల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రత్యేక సర్వీసులకు సాధారణ ఛార్జీల కంటే కాస్త ప్రత్యేక ఛార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందే రిజర్వేషన్లు పూర్తి చేసుకోవాలని, ప్రయాణ సమయాలను ఎన్‌టీఈఎస్ (NTES) యాప్ ద్వారా సరిచూసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+