కృష్ణానదిపై రెండు భారీ వంతెనలు, మూడు సొరంగాలు - అమరావతి ORR ఇలా..!!

అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఒక వైపు నిర్మాణాలు కొనసాగిస్తూనే.. మరో వైపు రాజధానికి కనెక్టివిటీ పైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని నాలుగు ప్యాకేజీలుగా ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. కృష్ణానదిపై రెండు చోట్ల భారీ వంతెనలు, మూడు సొరంగాలు సహా అన్ని నిర్మాణ పనులను ఈ నాలుగు ప్యాకేజీల్లోనే పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. మొత్తం 195.13 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పైన కీలక ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) అధికారులు ఈ మొత్తం నిర్మాణాన్ని నాలుగు ప్యాకేజీలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. ప్రధానంగా 189.93 కిలోమీటర్ల మేర ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు, నారాకోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.2 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల అనుసంధాన రహదారిని (స్పర్ రోడ్డు) కలిపి మొత్తం 195.13 కిలోమీటర్ల మేర ఈ మెగా ప్రాజెక్టును చేపట్టనున్నారు. తొలి ప్యాకేజ్ కంచికచర్ల సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వద్ద సున్నా కిలోమీటర్ (0 కి.మీ.) పాయింట్ నుంచి ప్రారంభమవుతుంది. రెండో ప్యాకేజీ మైలవరం నుంచి కోలవెన్ను వరకు 56 కిలోమీటర్లు మేర కొనసాగనుంది.

పవన్ లో సడన్ ఛేంజ్ వెనుక- మారుతున్న లెక్కలు.!!
పవన్ లో సడన్ ఛేంజ్ వెనుక- మారుతున్న లెక్కలు.!!
nhai-plans-amaravati-outer-ring-road-in-four-packages-at-30-491-crore-here-the-latest-report

NHAI తాజా ప్రతిపాదనలతో

మూడో ప్యాకేజీ కృష్ణా జిల్లా కోలవెన్ను (83వ కి.మీ.) వద్ద ప్రారంభమై గుంటూరు జిల్లా వట్టిచెరు కూరు మండలం పుల్లడిగుంట సమీపంలోని 133.5వ కిలోమీటర్ వరకు 50.5 కిలోమీటర్ల మేర సాగుతుంది. నాలుగో ప్యాకేజీ 133.5వ కిలోమీటరు నుంచి ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల సమీపంలోని 189వ కిలోమీటరు వరకు 55.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ సమగ్ర వ్యయం రూ.30,491 కోట్లుగా నిర్ధారించారు. ఇందులో నాలుగు ప్యాకేజీలకు సంబంధించిన సివిల్ ఇంజనీరింగ్ పనులకే రూ.10,595.70 కోట్లు వెచ్చించనున్నారు. కృష్ణానదిపై రెండు చోట్ల భారీ వంతెనలు, మూడు సొరంగాలు సహా అన్ని నిర్మాణ పనులను ఈ నాలుగు ప్యాకేజీల్లోనే పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+