పవన్ లో సడన్ ఛేంజ్ వెనుక- మారుతున్న లెక్కలు.!!
ఏపీ రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేనాని పవన్ రూటు మార్చారు. కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. పవన్ లో కొత్త మార్పు కనిపిస్తోంది. స్థానిక ఎన్నిక ల వేళ పవన్ పార్టీ నేతలకు చేస్తున్న దిశా నిర్దేశం.. పార్టీలో ఒకే సారి పెరిగిన చేరికలు కూటమిలో చర్చగా మారాయి. పవన్ వైఖరి స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. దీంతో.. పవన్ తాజా నిర్ణయాలు స్థానిక ఎన్నికలతో సహా భవిష్యత్ పరిణామాల పైన ప్రభావం చూపటం ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి. రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి.
పవన్ రాజకీయ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థానిక ఎన్నికల వేళ పవన్ నిర్ణయాలు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూనే.. స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ కంటెస్ట్ కు పార్టీ నేతల కు అనుమతి ఇవ్వటం కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో పార్టీలో ఒకే సారి చేరికలకు గేట్లు తెరవటం ఆసక్తిని పెంచుతోంది. జనసేనలో ఒకే రోజు పలువురు నేతలు చేరారు. యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు, హిందూపురంకు చెందిన సీనియర్ వైఎస్సార్సీపీ నాయకులు నవీన్ నిశ్చల్, ఉండి నియోజకవర్గానికి చెందిన పలువురు జనసేనలో చేరారు.

పవన్ తాజా నిర్ణయాలతో
వీరితో పాటు పీవీఎల్ఎన్ నరసింహరాజు, కందుకూరు, సర్వేపల్లి, కనిగిరి నుంచి మన్నెమాల సుకుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు అయితాబత్తుల సుభాషిణి కూడా జనసేనలో చేరారు. తునికి చెందిన పొలినాటి శేషగిరిరావు, తణుకు నుంచి దిరిశాల కృష్ణ శ్రీనివాస్, శ్రీకాళహస్తికి చెందిన సత్రవాడ ప్రవీణ్, మిద్దెల హరి, ముమ్మడివరం మాజీ ఏఎంసీ ఛైర్మన్ కుడిపూడి శివన్నారాయణ, నరసరావుపేటకు చెందిన ఏలూరి ప్రసాద్ తదితరులు పవన్ కల్యాణ్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా.. అందరినీ కలుపుకొని, సమష్టిగా పనిచేస్తూ పార్టీ ఉన్నతికి కృషి చేయాలని వారికి పవన్ దిశానిర్దేశం చేశారు. కాగా.. పవన్ పార్టీ బలోపేతం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు... చేరికలు.. నేతలకు చేస్తున్న దిశా నిర్దేశంతో.. జనసేనాని భవిష్యత్ వ్యూహాలు స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కూటమిలో ఉంటూనే తన పార్టీ బలోపేతం దిశగానే పవన్ నిర్ణయాలు ఉంటున్నాయి. దీంతో.. రానున్న రోజుల్లో పవన్ నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే చర్చ రాజకీయంగా మొదలైంది.













Click it and Unblock the Notifications
