గోదారమ్మ ఉగ్రరూపం- ఏపీలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల కురిసిన అతి భారీ వర్షాలకు ఏపీలోని ప్రధాన నదులన్నీ ఉధృతితో ఉప్పొంగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి నదులలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. పలు బ్యారేజీల వద్ద ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. రక్షణ చర్యలు చేపట్టారు.

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఇన్ ఫ్లో అయిదు లక్షల క్యూసెక్కులను మించిపోయింది. వచ్చిన నీటిని వచ్చినట్టుగానే దిగువకు విడుదల చేస్తోన్నారు అధికారులు. ఈ రాత్రి నాటికి ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద నీరు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు. గోదావరి వరద తాకిడికి పోలవరం, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమౌతున్నాయి.

Godavari Flood in Andhra Pradesh as Dowleswaram Inflow Outflow Hits 5 Lakh Cusecs Closely Track Level

ఆయా జిల్లాల యంత్రాంగాన్ని విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నదిలో స్నానానికి దిగడం, చేపలు పట్టడంలాంటివి చేయకూడదని, వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణించవద్దని విజ్ఞప్తి చేేసింది. అటు విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు భారీగా నీటి విడుదల కొనసాగుతోంది. కృష్ణా నదీ పరివాహక దిగువ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

మీరొక కీలుబొమ్మ: ఐరాసలో పాకిస్తాన్ ను ఉతికి ఆరేసిన భారత్
మీరొక కీలుబొమ్మ: ఐరాసలో పాకిస్తాన్ ను ఉతికి ఆరేసిన భారత్

ఉత్తరాంధ్రను వంశధార, నాగావళి నదుల వరద ముంచెత్తుతోంది. నాగావళిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట వద్ద ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇక్కడ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 76,000 క్యూసెక్కులుగా ఉంటోంది. ప్రవాహం స్థిరంగా పెరుగుతుండటంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. తోటపల్లి ప్రాజెక్ట్ వద్ద ఇన్ ఫ్లో 24,639 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 23,250 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

ఆ చర్యను యుద్ధంగానే పరిగణిస్తాం: ఐరాస వేదికగా భారత్ ను డైరెక్ట్ గా హెచ్చరించిన పాకిస్తాన్ ప్రధాని
ఆ చర్యను యుద్ధంగానే పరిగణిస్తాం: ఐరాస వేదికగా భారత్ ను డైరెక్ట్ గా హెచ్చరించిన పాకిస్తాన్ ప్రధాని

వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఇన్ ఫ్లో 43,860 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 46,197 క్యూసెక్కులుగా ఉంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. సహాయక బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి అత్యవసర చర్యలు వేగవంతం చేశాయి.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఇకపై..!!
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఇకపై..!!

ప్రస్తుత అంచనాల ప్రకారం, శనివారం నుంచి వంశధార, నాగావళి నదులలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఆదివారం రాత్రి నుంచి గోదావరి వరద ఉధృతి కూడా తగ్గే వీలుంది. అప్పటివరకు నదీ తీర ప్రాంత వాసులు, మత్స్యకారులు నదులలోకి వెళ్లవద్దని, అత్యవసర సమయాల్లో స్థానిక ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+