20 రోజులకే ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే..!

ఇటీవలి కాలంలో చిన్న సినిమాల ప్రభంజనం కొనసాగుతోంది. పెద్ద పెద్ద బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండగా.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. అలాంటి కోవకు చెందిన చిత్రమే టాలీవుడ్ నటుడు తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ నటించిన ఓ సుకుమారి మూవీ. ఈ చిత్రాన్ని భరత్ దర్శన్ తెరకెక్కించారు. ఈ రూరల్ రొమాంటిక్ కామెడీ మూవీ జూలై 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలా థియేటర్లలో విడుదలైన కేవలం 3 వారాల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఆసక్తికర కథాంశంతో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది ఓ సుకుమారి మూవీ. ఈ మేరకు ఆగస్టు 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఓ సుకుమారి మూవీ అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఇక తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీలో ఆనంద్‌, ఝాన్సీ, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, అంజిమామ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. హీరోయిన్‌ ను ముట్టుకుంటే క‌రెంట్ షాక్ కొడుతుంది అనే విభిన్నమైన కథాంశంతో దర్శకుడు భ‌ర‌త్ ద‌ర్శ‌న్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

OSukumari Telugu romantic comedy movie OTT platforms in just twenty days streaming starts August 7

అయితే కథను వెరైటీగా చెప్పడంలో కొత్త దర్శకుడు కాస్త తడబడ్డాడు. దాంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధం అవుతోంది. స్టోరీ విషయానికి వస్తే యాదగిరి (తిరువీర్) దామిని (ఐశ్వర్య రాజేశ్)ను చూసి ప్రేమలో పడతాడు. అయితే దామిని పొర‌పాటుగా ఎవ‌రిన‌న్నా త‌గిలినా.. ఆమెను ఎవ‌ర‌న్నా ముట్టుకున్నా క‌రెంట్ షాక్‌ కొడుతుంది. అయితే ఆ విషయం దాచిపెట్టి ఊరివారంతా యాద‌గిరితో దామిని పెళ్లిచేస్తారు. కానీ శోభనం రోజే దామినికి ఉన్న స‌మ‌స్య గురించి యాద‌గిరికి తెలుస్తుంది.. ఆ తర్వాత ఏం జరిగింది..? అనేదే స్టోరీ. మరి ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల్ని ఎంత మేరకు అలరిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+