నరేష్ ఎనర్జీపై బోల్డ్‌గా కామెంట్స్ చేసిన పవిత్రా లోకేష్
దక్షిణ భారతదేశంలో నరేష్ - పవిత్రా లోకేష్ జంట గురించి తెలియనివారు ఉండరు. కరోనా వైరస్ తర్వాత అంతగా పాపులర్ అయ్యారు వీరిద్దరూ. నరేష్ మూడోభార్య వీరిద్దరినీ బెంగళూరులోని హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, మీడియాను అక్కడకు తీసుకువెళ్లడం లాంటి రచ్చ రచ్చ తెలుగువారికి వినోదాన్ని పంచింది. అయినా తగ్గేదేలే అంటూ నరేష్ మాత్రం మూడోభార్యకు విడాకులివ్వడానికే సిద్ధమయ్యారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో ఈ జంట సహజీవనం చేస్తోంది. ఇటీవలే హనీమూన్ కు కూడా వెళ్లివచ్చారు. వీరిద్దరు ఒకరికొకరు జీవించినట్లుగా, యవ్వనంలో ఉన్నవారు ప్రేమించుకున్నట్లుగా ప్రేమలో మునిగివున్నారు.
నరేష్ తో తాను పోటీపడలేనన్న పవిత్ర
తాజాగా ఓ సినిమా వేడుకలో నరేష్, పవిత్రా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవిత్రా లోకేష్ నరేష్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 10 మందిలో కలిపివుండే ఎనర్జీ నరేష్ ఒక్కడిలోనే ఉంటుందని, ఆయన ఎనర్జీని ఎవరితోను పోల్చలేమన్నారు. నరేష్ తో తాను పోటీపడలేనని, అలిసిపోయిన తర్వాత చాలాసార్లు ఇక చాలు అంటున్నప్పటికీ వినరని, తాను అలిసిపోయినా నరేష్ అలిసిపోరని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంత బోల్డ్ గా మాట్లాడుతుందని ఎవరూ ఊహించకపోవడంతో అందరూ షాక్ కు గురయ్యారు.

తన జీవితం మొత్తం మారిపోయింది
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ పవిత్రా లోకేష్ గురించి చెప్పారు. తన జీవితంలోకి ఆమె వచ్చిన తర్వాత మొత్తం జీవితం మారిపోయిందని, ఎంతో ప్రశాంతంగా తాను జీవించగులుగుతున్నట్లు చెప్పారు. నిజ జీవితంలో టైటానిక్ షిప్ మునిగిపోయిందని, కానీ పవిత్రా లోకేష్ వల్ల తన జీవితమనే టైటానిక్ షిప్ ఒడ్డుకు చేరిందన్నారు. జీవితాన్ని అర్థం చేసుకునే భాగస్వామి లభిస్తే అంతకంటే స్వర్గం ఏదీ ఉండదని, తనకు అదృష్టవశాత్తూ పవిత్రా లోకేష్ దొరికిందని, తన అదృష్టం అన్నారు. సినీ పరిశ్రమలో ఉన్నవారు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇంటికి వచ్చిన తర్వాత పవిత్రాలోకేష్ లాంటి భార్య ఉంటే ఆ కష్టాలన్నింటినీ మర్చిపోతామన్నారు. ఈ వ్యాఖ్యలతో ఈ జంట వార్తల్లో నిలుస్తోంది.












Click it and Unblock the Notifications