'హరిహర వీరమల్లు' సినిమా ఉచిత ప్రదర్శన.. అయినా..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా జులై 24 న విడుదలైంది. తొలి షో నుంచే ఈ మూవీకి నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా భారీ నష్టాల్ని చవి చూస్తోంది. మొదటి షో నుంచే ప్లాఫ్ టాక్ రావడంతో సినిమాను ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్స్ లో 80-85 శాతం డ్రాప్ కనిపించడం ఇందుకు నిదర్శనం. దీంతో ఈ మూవీతో బిజినెస్ చేసినవాళ్లకు భారీ నష్టాలు తప్పేలా లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి రోజున సినిమాకు రూ.40 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి. పవన్ కల్యాణ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా హరిహర వీరమల్లు నిలిచింది. ఇక రెండో రోజు అయితే దాదాపుగా 85 శాతం మేర కలెక్షన్స్ అమాంతం పడిపోయాయి. నెగెటివ్ టాక్ నేపథ్యంలో హరిహర వీరమల్లు మూవీ ఒక్కసారిగా డౌన్ అయింది. ఏ ఎం రత్నం దాదాపు రూ. 300 కోట్లు పెట్టి తెరకెక్కించారు. దీంతో ఈ మూవీతో బిజినెస్ చేసిన వారికి భారీ నష్టాలను చవిచూడనున్నారు.
అయితే తాజాగా వేములవాడ పట్టణంలో హరిహర వీరమల్లు సినిమాను బీజేపీ నేతలు ఉచితంగా నాలుగు షోలు ప్రదర్శించారు. సినిమాను ఫ్రీగా ప్రదర్శన చేయడంతో స్థానిక ప్రజలు, విద్యార్థులు వచ్చి సినిమాను చూశారు. వేములవాడ పట్టణంలోని శివరామకృష్ణ టాకీస్ లో ఈ ఉచిత ప్రదర్శన ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. ఈ ఉచిత ప్రదర్శన కార్యక్రమాన్ని బిజెపి పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షులు, బీజేపీ స్టేట్ లీడర్ ప్రతాప రామకృష్ణ టికెట్లను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. హరిహర వీరమల్లులో హిందూ సనాతన ధర్మం విలువలు భావితరాలకు అందించే విధంగా సినిమా రూపొందించడం అభినందనీయమని అన్నారు. అందరూ ఈ సినిమాను చూసి ఆదరించాలన్నారు. ఆ తర్వాత వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ ప్రసంగించారు. పట్టణంలో నాలుగు షోలు ఉచితంగా ప్రదర్శిస్తున్నామని హరిహర వీరమల్లు మూవీ.. సందేశాత్మకంగా సనాతన ధర్మం అద్దం పట్టే విధంగా ఉందని తెలిపారు.

ఈ మూవీ జులై 24 న గ్రాండ్ గా విడుదలైంది. టాలీవుడ్ డైరెక్టర్స్ క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బాబీ డియోల్ ఔరంగ జేబ్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించారు. కీరవాణి మ్యూజిక్ అందించారు.












Click it and Unblock the Notifications