Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంత బెస్ట్ ఇవ్వాలో అంతా ఇచ్చా.. కానీ యుద్ధమే చేయాలి !

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నటించిన లేటెస్ట్ చిత్రం 'హరి హర వీరమల్లు'. ఈ పీరియాడిక్ డ్రామాకు మొదట క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించగా.. పలు అనివార్య కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమా పూర్తిచేశారు. కాగా ఇప్పుడు ఫస్ట్ పార్టీ " స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌ " పేరుతో.. జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నిధి అగర్వాల్‌ నటిస్తుండగా.. అనుపమ్‌ఖేర్‌, బాబీ దేవోల్‌, సునీల్‌, నాజర్‌, కబీర్‌ సింగ్‌, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త కీలక పాత్రలలో నటిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా చేయగా.. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇప్పటికే పవన్ రాజకీయాల బిజీ షెడ్యూల్, విఎఫ్ఎక్స్ పనుల జాప్యం వల్ల సుమారు 14 సార్లు వాయిదా పడింది. ఈ విషయం కూడా ఓ రికార్డుగా నిలిచింది.

pawan kalyan shocking comments on harihara veeramallu press meet

సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో మూవీ టీం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది ఈ మేరకు.. లేటెస్ట్ గా గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పలు షాకింగ్ కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

పవన్ ఏమన్నారంటే..?

పోడియం లేకుండా మాట్లాడటం కష్టంగా ఉందని పవన్ వ్యాఖ్యానించారు. తన జీవితంలో సినిమా పరంగా మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి అని.. సినిమాను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో తనకు తెలియదు అని చెప్పుకొచ్చారు. ఈ ప్రెస్‌మీట్‌ పెట్టడానికి కారణం ఏఎం రత్నమే అని.. రీజీనల్ సినిమాని పాన్‌ఇండియా స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి అని కొనియాడారు. సినిమాను రూపొందించాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలి అని తెలిపారు.

అంతే కకు తాను యాక్సిడెంటల్ యాక్టర్ ని అని.. గత్యంతరం లేక సినిమాలలోకి వచ్చానని చెప్పారు. పాలిటిక్స్ వల్ల సినిమాలకు దూరంగా వెళ్లిన కూడా.. మళ్లీ సినిమా చేయాలనీ రత్నం అడిగినపుడు ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత ఈ సినిమా కోసం ఇచ్చానన్నారు. తాను పరిస్థితుల్లో సినిమా కోసం టైమ్ ఇవ్వాలేన అని.. కానీ ఈ సినిమా క్లైమాక్స్ కోసం 57 రోజులు ఇచ్చానని స్పష్టం చేశారు. సినిమా తనకు ప్రాణవాయువు అని.. అన్నం పెట్టిందని ఎమోషనల్ అయ్యారు. మిగతా హీరోలకు బిజినెస్ అయినంత తన సినిమాకు కాదని.. ఈ సినిమా అనాథ కాలేదని చెప్పడానికి ఈరోజు వచ్చానని వివరించారు.

దర్శకుడు క్రిష్ మంచి కాన్సెప్ట్‌తో నా దగ్గరకు వచ్చారు. కథ నచ్చడంతో నేను ఓకే చెప్పాను. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సినిమా షూటింగ్‌కు రోజుకు రెండు గంటల మాత్రమే సమయం కేటాయించగలిగాను. ఓ సమయంలో ఈ సినిమా కోసం ఒక గోడౌన్‌లో షూట్ చేశామన్నారు. ఈ సినిమా ఎంత హిట్ అవుతుంది, ఎంతమేరకు కలెక్షన్లు వస్తాయన్నది అంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉందని పవన్ అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+