బాలక‌ృష్ణ అల్లుడుపై పూనమ్ కౌర్ షాకింగ్ ట్వీట్

నటి పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అవకాశం చిక్కినప్పుడల్లా జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌లపై పూనమ్ కౌర్ పరొక్షంగా ట్వీట్లు వేస్తుంటుంది. ఆ మధ్య గుంటూరు కారం సినిమా కాపీ కథ అని ప్రచారం చేసిన వెబ్ సైట్ పోస్టుని షేర్ చేస్తూ ట్విట్టర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్ ఏదిచేసినా చెల్లుతుంది. ఆయనను కొంత మంది ఇంకా గుడ్డిగా వెనకేసుకోస్తున్నారని ఘాటైన విమర్శలు చేశారు. త్రివిక్రమ్ అప్పటి ప్రభుత్వం మద్దతుఉందని.. సాధారణ ప్రజా సమస్యలు పట్టింపులేని ప్రభుత్వం ఆయనకు మాత్రం హెల్ఫ్ చేసిందంటూ రాసుకొచ్చారు.

ఈ మధ్య ఏపీ రాజకీయాలపై కూడా పూనమ్ స్పందిస్తోంది.ఇటీవలే ఏపీని ఉత్తర ప్రదేశ్‌తో పోల్చారు. ఏపీ ఈజ్ ద న్యూ యూపీ అంటూ కామెంట్స్ పెట్టారు. ఏపీ కొత్త ఉత్తరప్రదేశ్‌గా అవతరిస్తోందంటూ అభివర్ణించారు.తాజాగా ఆమె మరోసారి ఏపీ లీడర్ల గురించి కామెంట్ చేసింది. బాలకృష్ణ చిన్న అల్లుడు గురించి పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. బాలకృష్ణ పెద్ద అల్లుడు నారా లోకేష్ మంగళగిరి పోటీ చేస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక రెండో అల్లుడు శ్రీ భరత్ కూడా విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ పోటీ చేసిన శ్రీ భరత్..వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎం వి వి సత్యనారాయణ చేతిలో ఓటమిపాలయ్యారు.

Poonam Kaur suppot to balakrishna son-in-law sri bharath

ఆయన మరోసారి విశాఖ బరిలో నిలిచి తన అదృష్టానాన్ని పరీక్షించుకోనున్నారు. టీడీపీ తరుఫున విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకుంటున్నారు.తాజాగా ఆయనపై నటి పూనమ్ కౌర్ ట్వీట్ సంచలనంగా మారింది. పొలిటికల్ సినారియో చూస్తుంటే బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీ భరత్ ఏదో సాధించేలా కనిపిస్తున్నాడని పూనమ్ ట్వీట్ చేసింది.

వైజాగ్ నుంచి ఆయన గెలిచి పార్లమెంటుకు వెళితే అది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఎడ్యుకేషన్ భవిష్యత్తు గురించి శ్రీ భరత్‌కు ఉన్న విజన్ కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవ్వకూడదు అన్నట్టుగా ఆమె ట్వీట్ చేసింది. తాను భరత్ ను సపోర్ట్ చేస్తున్నట్టుగానే భావించాలని పేర్కొన్న ఆమె ఇది ఎవరూ డబ్బులు ఇచ్చి పెట్టించిన ట్వీట్ కాదు, అలాగే స్పాన్సర్ చేసిన ట్వీట్ కాదు అంటూ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పూనమ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+