శ్రేయాస్ అయ్యర్ వల్ల తల్లయ్యాను ..ప్రముఖ హీరోయిన్ సంచలనం
శ్రేయాస్ అయ్యర్ ..టీమిండియా క్రికెట్‌లో ప్రస్తుతం మార్మోగుతున్న పేరు. ముఖ్యంగా ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లకు నాయకత్వం వహించి, ఆ జట్లను ఫైనల్‌కు చేర్చిన ఘనత
శ్రేయాస్ అయ్యర్‌దే. అతని నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ 2025లో 11 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. కెప్టెన్‌గా అతను జట్టును విజయపథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. 2025 ఐపీఎల్‌లో అతను 17 మ్యాచ్‌లలో 604 పరుగులు చేసి, ఒక బ్యాట్స్‌మెన్‌గా కూడా అద్భుతంగా రాణించాడు.అతనిని భారత జట్టుకు భవిష్యత్ వైట్‌బాల్ కెప్టెన్సీ రేసులో నిలబెట్టాయి.
ఇదిలా ఉంటే తాజాగా శ్రేయాస్ అయ్యర్ గురించి ఓ నటి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.బిగ్ బాస్ 18 ఫేమ్, మోడల్ ఎడిన్ రోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌ను తాను మనస్సులో ఇప్పటికే పెళ్లి చేసుకున్నానని, అతని పిల్లలకు తల్లిని అని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఫిల్మిగ్యాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎడిన్ రోజ్ మాట్లాడుతూ, శ్రేయాస్ అయ్యర్ మంచి హైట్, చామనఛాయ రంగు, గడ్డం, మంచి కండలతో ఉంటాడని, భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్ అవుతాడని ప్రశంసించింది. తన తండ్రిలాగే శ్రేయాస్ కూడా తమిళుడని, ప్రస్తుతం ముంబైలో స్థిరపడ్డారని పేర్కొంది. అయితే ఎడిన్ రోజ్ చేసిన కామెంట్‌పై నెటిజన్‌లు రియాక్ట్ అవుతున్నారు.
మనసులో అనుకుంటే పెళ్లిళ్లు కావు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఎడిన్ రోజ్ కెరీర్ విషయానికి వస్తే..తెలుగులో రవితేజ 'రావణాసుర'లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ భామ, ప్రస్తుతం నయనతార నిర్మిస్తున్న 'LIK' (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)లో కీలక పాత్రలో నటిస్తోంది.












Click it and Unblock the Notifications