పవన్ కు షాకిచ్చిన సంధ్య థియేటర్..?
చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సినిమా సందడి నెలకొంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు.. జులై 24న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జాగర్లమూడి క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో అభిమానులు ఈ సినిమాను తొలిరోజు తొలి ఆటకే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఇక ప్రస్తుతానికి కొన్ని థియేటర్లలో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ చేశారు. మరికొద్ది గంటల్లో పూర్తిస్థాయి టికెట్ బుకింగ్స్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఇక ఏపీలో హరి హర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్లు మొదటి రెండు వారాలకు పెంచాలని నిర్మాతలు కోరగా కేవలం మొదటి పది రోజులకే టికెట్ రేట్లు పెంచేలా అనుమతులు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అప్పర్ క్లాస్..150 రూపాయలు, లోయర్ క్లాస్ 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు మాత్రమే పెంచుకునేలా అనుమతులు వచ్చాయి. ఇక ప్రీమియర్ షో రాత్రి 9 గంటలకు అనుమతి ఇచ్చారు. దానికి 600 పెంచుకునేలా అనుమతి ఉంది.
అలాగే తెలంగాణలోనూ హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్లు పెంచారు. పుష్ప 2 సినిమాకు సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన తర్వాత రేట్లు పెంచమని.. స్పెషల్ షోలకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కానీ హరిహర వీరమల్లు చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో టికెట్ రేట్లు, స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చారు అధికారులు.
తెలంగాణలో ముందు రోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకి అనుమతి ఇస్తూ 600 రూపాయలు టికెట్ రేటు పెంచుకోడానికి అనుమతి ఇచ్చారు. ఇక జులై 24 నుంచి 28 వరకు మల్టిప్లెక్స్ లకు 200 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ కు 150 రూపాయలు పెంచారు. అలాగే జులై 28 నుంచి ఆగస్టు 2 వరకు 150 రూపాయలు మల్టిప్లెక్స్ లకు, 106 రూపాయలు సింగిల్ స్క్రీన్స్ కు పెంచారు.
అయితే హైదరాబాద్ లోని ప్రముఖ ధియేటర్ సంధ్యలో హరిహర వీర మల్లు బుకింగ్స్ కేవలం రెండో షోలకు మాత్రమే చూపిస్తోంది. అవి కూడా ఫుల్ అని చూపిస్తున్నాయి. మిగతా థియేటర్లలో ఐదు షోలు చూపిస్తుంటే సంధ్య థియేటర్ లో మాత్రం కేవలం రెండు షోలు అవి కూడా మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలు ఒకటి, మరొకటి 6 గంటల షో చూపిస్తున్నాయి. దీంతో సంధ్య థియేటర్ లో మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అలాగే ప్రీమియర్ షో కూడా ఈ థియేటర్ లో క్యాన్సిల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇది వరకు హరిహర వీర మల్లు ట్రైలర్ కూడా సంధ్య థియేటర్ లో ప్రదర్శించలేదు. ఫ్యాన్స్ అధికంగా వస్తారని.. పుష్ప-2 సమయంలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. తాజాగా మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications