'ఎపిక్' ముద్దు సీన్ వివాదం.. నిర్మాత నాగ వంశీ షాకింగ్ కామెంట్స్!
యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ, వైష్టవి చైతన్య జంటగా నటించిన 'ఎపిక్' సినిమాలోని ఓ ముద్దు సీన్ చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ, ట్రోలింగ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ వివాదంపై స్పందించారు. కేవలం ఒక్క ముద్దు సన్నివేశాన్ని మాత్రమే పట్టుకుని, సినిమా మొత్తాన్ని అంచనా వేయవద్దని ఆయన ప్రేక్షకులు, నెటిజన్లను కోరారు. ఈ సినిమాలో అంతకు మించి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందని నాగ వంశీ తెలిపారు.
ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అమ్మాయిని కలవడం, ప్రేమించడం సాధారణమని.. అవి సినిమాటిక్‌గా చూపించడంలో తప్పులేదని ఆయన అన్నారు. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య ఉండే బంధాన్ని, వారి సంబంధాన్ని ఎంత స్వచ్ఛంగగా, ప్యూర్ గా చూపించారో సినిమా చూస్తే తెలుస్తుందని నిర్మాత నాగ వంశీ పేర్కొన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య ఉండే బంధమే ఈ కథకు ప్రధాన బలమని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాను కుటుంబసమేతంగా చూసి ఆస్వాదించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ట్రైలర్లో కనిపించిన ముద్దు సీన్ ఆధారంగా సినిమాను అడల్ట్ ఫిల్మ్‌గా భావించవద్దని ప్రేక్షకులను కోరారు. 2 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో దాదాపు గంటా 40 నిమిషాలు వైష్ణవి, ఆనంద్ మాట్లాడుకుంటూ ఉండారని నాగ వంశీ తెలిపారు.

తెలంగాణ ప్రాంతం నుంచి కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న కుర్రాడు, కాన్ఫిడెంట్ ఉన్న అమ్మాయి ప్రేమలో పడితే బంధం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చక్కగా చూపించారని నాగ వంశీ పేర్కొన్నారు. ఆర్థిక నేపథ్యం ఆధారంగా సంబంధాలు ఎలా ప్రభావితమవుతాయో కూడా సినిమాలో ఉంటుందని వెల్లడించారు. అలాగే తనకు రొమాంటిక్ కామెడీ సినిమాలు, కుటుంబ కథా సినిమాలు ఇష్టమైన జానర్ అంటూ పేర్కొన్నారు. ప్రేమించుకునే జంటలు ఈ చిత్రంతో తప్పకుండా కనెక్ట్ అవుతారని ఆయన వెల్లడించారు.
మరోవైపు ఈ సినిమా డైరెక్టర్ ఆదిత్య హాసన్ గతంలో "#90s" వెబ్ సిరీస్ తో ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఎపిక్ సినిమాతో ఆయన లివ్-ఇన్-రిలేషన్ షిప్, దంపతుల మధ్య సాన్నిహిత్యం, అందులోని కష్టాలు వంటి కాస్త పరిణతి చెందిన అంశాలను స్పృశిస్తూ కొత్త లీగ్‌లోకి అడుగుపెడుతున్నారు. కేవలం ముద్దు సన్నివేశం మాత్రమే ప్రచారంలో నిలిచినప్పటికీ.. ఆ వివాదానికి అతీతంగా ప్రేక్షకులు సినిమాలోని అసలు కథను ఇష్టపడతారని సినీ మేకర్స్ ఆశిస్తున్నారు.














Click it and Unblock the Notifications
