దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేయండి: టాలీవుడ్ నిర్మాత సంచలనం
టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ 'మ్యాడ్' సినిమాతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించారు. 2023లో విడుదలైన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. రూ. 50 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం రూ. 100కోట్ల దిశగా మూవీ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత నాగవంశీ మీడియాతో మాట్లాడారు. సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టే హిట్ అయిందన్నారు. సినిమాపై అనవసర నెగిటివ్ రివ్యూలు రాస్తున్నవారిపై ఆయన ఫైర్ అయ్యారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించరని ప్రశ్నించారు.
'కంటెంట్ లేకపోయినా కూడా సీక్వెల్ కాబట్టి ఆడుతోందని కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సరికాదు. ఎలా ఉన్నా చూడడానికి ఇదేం బాహుబలి2, పుష్ప2, కేజీఎఫ్2 సినిమా కాదు. సినిమాలో కంటెంట్ లేకుండా చూడడానికి ఇందులో స్టార్ హీరోలు నటించలేదు. కోర్టు మూవీ బాగుంది కాబట్టి చూశారు. పక్క సినిమా బాగోలేక దాన్ని చూడలేదు. అలాగే 'మ్యాడ్ స్క్వేర్' సినిమా బాగుంది కాబట్టి చూస్తున్నారు' అని నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు.

'నా మీద పగ ఉంటే దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేయండి. నా సినిమా మీద ఆర్టికల్స్ రాయకండి. నా దగ్గర యాడ్స్ తీసుకోకండి. నేను సినిమాలు తీసి విడుదల చేస్తేనే మీ వెబ్‌సైట్స్ వర్క్ అవుతాయి. నా ఇంటర్వ్యూలతోనే యూట్యూబ్ ఛానెళ్లు పని చేస్తాయి. మేము ప్రకటనలు ఇస్తేనే మీ సైట్స్ పని చేస్తాయని నిర్మాత నాగవంశీ ఫైర్ అయ్యారు
సినిమాను చంపకండి. సినిమా ఆడుతున్నప్పుడు కూడా కంటెంట్ లేని సినిమా ఎందుకు ఆడుతుందో తెలియడం లేదని రివ్యూలు ఇవ్వడం సరికాదన్నారు. సినిమాలు ఆడితేనే మీరుంటారని.. లేకపోతే ఇంటికి వెళ్లాల్సిందేనన్నారు.ఇది గుర్తుంచుకోవాలని నిర్మాత నాగవంశీ మండిపడ్డారు. గతేడాది లక్కీ భాస్కర్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు నిర్మాత నాగవంశీ. మరోసారి మ్యాడ్ స్క్వేర్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.












Click it and Unblock the Notifications