'కూలీ'తో తెలుగులో నయా మోసానికి తెరలేపిన నిర్మాతలు!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విడుదలవుతున్న చిత్రం కూలీ. అక్కినేని నాగార్జున ప్రతినాయకుడిగా నటించారు. అమిర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్లు క్యామియో పాత్రలు పోషించారు. 14వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమాకు తెలుగులో కూడా టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. తమిళంలో మాత్రం సాధారణ ధరలే ఉంటుండగా మన ప్రభుత్వాలకు తమిళ సినిమాలపై ప్రేమ ఎక్కువై థియేటర్ల టికెట్ ధరలు పెంచుకొని ప్రజల నుంచి దోచుకోవడానికి అనుమతిచ్చాయి.
బ్లాక్ చేసిన టికెట్లు అమ్మకానికి
దీన్ని అలుసుగా తీసుకున్న ఈ సినిమా నిర్మాతలు తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ బుకింగ్స్ కు తెరలేపారు. టికెట్లు బుక్ చేసుకొందామని సైట్ ఓపెన్ చేసేసరికి హౌస్ ఫుల్ బోర్డు చూపిస్తోంది. అబ్బో అసలు టికెట్లు దొరకడంలేదుగా అని జనం అనుకుంటున్నారు. అలాంటి ట్రిక్ చేయడంద్వారా క్యాష్ చేసుకొందామని థియేటర్స్ యాజమాన్యం అనుకుంటోంది. ఈరోజు ఓపెన్ చేసి చూస్తే నిన్న అయిపోయాయి అని బోర్డు చూపిన థియేటర్లోనే ఖాళీలు కనపడుతున్నాయి. ప్రతి క్రేజీ సినిమా విడుదలయ్యే సమయంలో థియేటర్లలో కొన్ని సీట్లు బ్లాక్ చేస్తారు. అలా బ్లాక్ చేసిన సీట్లను బయట బ్లాక్ లో అమ్ముతారు. దీనివల్ల థియేటర్ యాజమాన్యానికి కొంత ఆదాయం సమకూరుతుంది.

దోపిడీ ఆగనంతకాలం పైరసీ సైట్లలోనే చూస్తాం
కూలీ సినిమాకు మొదటిరోజు బ్లాక్ చేసిన టికెట్లన్నింటినీ మళ్లీ విడుదల చేశారు. క్రేజ్ బ్రహ్మాండంగా ఉంది.. అలాంటప్పుడు అయిపోయాయి అనుకున్న టికెట్లను సేల్ పెట్టడం ఏమిటని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడంద్వారా అన్నిచోట్ల సన్ పిక్చర్స్ కానీ, ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నవారుకానీ నయా మోసానికి తెరలేపారంటూ విమర్శిస్తున్నారు. ప్రతి సినిమా విడుదలయ్యే సమయంలో ప్రేక్షకుడిని దోచుకోవడమేకానీ గతంలోలా సాధారణమైన ధరల్లోనే సినిమాను చూపిద్దామనే ఆలోచన మాత్రం ఎవరూ చేయలేదంటున్నారు. ఈ దోపిడీ ఆగనంతకాలం పైరసీ సైట్లలో సినిమాలు చూస్తుంటామని స్పష్టంగా ప్రేక్షకులు చెప్పేస్తున్నారు.












Click it and Unblock the Notifications