వార్నర్ బ్రదర్స్‌తో రాజమౌళి ఒప్పందం.. రూ.10వేల కోట్లు చాలా ఈజీ
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1200 నుంచి రూ.1500 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం ఇదే. మహేష్ బాబుతో నిర్మించే సినిమా ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి హాలీవుడ్ కు చెందిన వార్నర్ బ్రదర్స్ సంస్థతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారు.
10వేల కోట్లు చాలా సులువే
భారతదేశం మినహా మిగిలిన దేశాల్లో గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఈ సంస్థకు అప్పగించారు. ఒప్పందం కూడా కుదిరింది. బాహుబలి సినిమా తీసే సమయంలోనే ప్రపంచ మార్కెట్ కు సంబంధించి ఆ చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని అంచనా వేశారు. దాని ప్రకారమే బాహుబలి2 విడుదల చేసి రూ.1800 కోట్లకు పైగా కొల్లగొట్టారు. అందుకే ఈ చిత్రానికి కూడా వారిద్దరూ గ్లోబల్ మార్కెట్ కు సంబంధించిన పనులు చూస్తున్నారు. వారి ఆలోచనల ప్రకారమే వార్నర్ బ్రదర్స్ తో ఒప్పందం కుదిరింది. దీంతో ఈసినిమా 10 వేల కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టడం అనేది ఖాయమని మహేష్ బాబు అభిమానులు సంబరంతో ఉన్నారు.

వచ్చే ఏడాది చివరిలో..
హాలీవుడ్ లోని సూపర్ హిట్ చిత్రాలను కూడా ఇది బీట్ చేయడం ఖాయమంటున్నారు. ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ఆధ్యాత్మిక టచ్ కూడ రాజమౌళి కలిపారు. హైదరాబాద్ లో వేసిన కాశీ సెట్ లో అక్టోబరు 10వ తేదీ వరకు షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది చివరలో లేదంటే 2027లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందా? ఒక భాగమేనా? అనే విషయంలో చిత్ర బృందం స్పష్టత ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications