Ranabaali Official Trailer: విజయ్ దేవరకొండ 'రణబాలి' ట్రైలర్ రిలీజ్..
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలతో యూత్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత టాక్సీవాలా, కల్కి చిత్రాల్లో నటించారు. ఇటీవలి కాలంలో కింగ్డమ్ మూవీతో అలరించారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం రణబాలి అనే ప్రతిష్టాత్మక చిత్రం చేస్తున్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్ గా ఆయన సతీమణి రష్మిక మందన్న నటించడం విశేషం. ఈ సినిమా అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రణబాలి నుంచి ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేసింది. బ్రిటిష్ కాలంలో రాయలసీమలోని కరవు పరిస్థితులు, అక్కడి జీవన వైవిధ్యం, బ్రిటిషర్ల ఆగడాలను కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు ఈ మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలకు కూడా పెద్దపీట వేసినట్లు గ్లింప్స్, పాటలు చూస్తే అర్థం అవుతోంది.

అయితే రణబాలి మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. దాదాపు 3 నిమిషాల 47 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ను ఇవాళ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా రణబాలి ట్రైలర్ చూపించింది. రణబాలి మూవీలో విజయ్ దేవరకొండ మునుపెన్నడూ చూడని యోధుడి పాత్రలో నటిస్తున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాడే సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో ఆయన నట విశ్వరూపం చూపించనున్నారు. ఇక ఈ మూవీకి ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుల ద్వయం అజయ్ - అతుల్ సంగీతం అందిస్తున్నారు. అలాగే నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లో విలన్ పాత్రలో మెప్పించనున్నారు.












Click it and Unblock the Notifications
