‘నువ్వు నా మొగుడివి కాదు’.. కానిస్టేబుల్ భార్య మాటలతో భర్త షాక్!

ఈ-రిక్షా నడుపుతూ కష్టపడి చదివించి పోలీసు ఉద్యోగం వచ్చేలా చేసిన కుటుంబానికి ఓ మహిళా కానిస్టేబుల్ తీవ్ర అన్యాయం చేసిందనే వింత సంఘటన బీహార్ లోని కతిహార్ జిల్లాలో వెలుగుచూసింది. కైమూర్ జిల్లాకు చెందిన హన్స్‌లాల్ గుప్తా, ఉత్తరప్రదేశ్‌‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన ప్రతిభా విశ్వకర్మ 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. హన్స్‌లాల్ కుటుంబం కూడా వీరి వివాహాన్ని అంగీకరించి, 2024 ఏప్రిల్ లో కోర్టు ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేయించారు.

'Gyanu, It’s Done Bro’: సీజేపీ, విపక్షాలు, విద్యార్ధుల్ని ఏకం చేస్తున్న ఒకే ఒక్క నినాదం..!
'Gyanu, It’s Done Bro’: సీజేపీ, విపక్షాలు, విద్యార్ధుల్ని ఏకం చేస్తున్న ఒకే ఒక్క నినాదం..!

పెళ్లి తర్వాత ప్రతిభ తన ఉన్నత చదువుల కోరికను వెల్లడించడంతో ఈ-రిక్షా నడిపే మామగారు పరమహంస్ గుప్తా, భర్త హన్స్‌లాల్ గుప్తా ఆమె చదువుకు అండగా నిలిచారు. ఈ-రిక్షా నడపగా వచ్చిన ఆదాయంలో అధిక భాగం ప్రతిభ చదువుకే వెచ్చించి.. దాదాపు 8 నుంచి 9 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. ప్రతిభ కూడా కష్టపడి బీహార్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కతిహార్ జిల్లాలోని మన్సాహి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా నియామకం పొందింది.

Wife Rejects Husband After Becoming Constable Katihar Family Drama in Bihar Full Details Here

అయితే ఉద్యోగం వచ్చి నెలకు రూ.40 వేల సంపాదన ప్రారంభమయ్యాక ప్రతిభ ప్రవర్తనలో మార్పు వచ్చిందని భర్త హన్స్ లాల్ ఆరోపిస్తున్నాడు. తనను కలవడానికి వస్తే తప్పించుకోవడమే కాకుండా రాహుల్ శర్మ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని విమర్శించాడు. ఇప్పుడు తాను సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి అని.. తనను భర్తగా అంగీకరించేందుకు నిరాకరిస్తూ.. గతంలో జరిగిన పెళ్లి బలవంతంగా జరిగిందని చెబుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

NCC: చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. అమ్మాయిల కోసం పారా గ్లైడింగ్
NCC: చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. అమ్మాయిల కోసం పారా గ్లైడింగ్

భార్య తీరుతో విసిగిపోయిన భర్త హన్స్‌లాల్ గుప్తా, ఆయన తండ్రి పరమహంస్ గుప్తా కతిహార్ ఎస్పీ పరిచయ్ కుమార్ ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. ఇది అత్యంత వ్యక్తిగత విషయమని ఎస్పీ తెలిపినప్పటికీ.. మహిళా పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. తాము చేసిన త్యాగానికి బదులుగా మోసపోయామని ఏడుస్తున్న భర్త,తన భార్యతో మళ్లీ కలిసి జీవించాలనే కోరికతో కౌన్సెలింగ్ ప్రక్రియపై ఆశలు పెట్టుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+