ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ కమెడియన్ ను గుర్తుపట్టారా..? ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు భయ్యా..!

టాలీవుడ్ లో చాలామంది హాస్య నటులు ఉన్నారు. బహుశా తెలుగులో ఉన్నంతమంది కమెడియన్లు ఏ ఇండస్ట్రీలో లేరని తెలుస్తోంది. అయితే అందులో ఒకరే రామచంద్ర. వెంకీ, దుబాయ్ శీను, దరువు, సొంతం వంటి సినిమాల్లో నటించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రామచంద్ర. అయితే ప్రస్తుతం ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రామచంద్ర మెదడులో రక్తం గడ్డకట్టడంతో పక్షవాతం వచ్చింది. దాంతో ఎడమ చేయి, కాలు చచ్చుబడిపోయాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం చేయించుకోవడం సమస్యగా మారిందని మీడియాతో తెలిపాడు రామచంద్ర. వైద్యం కోసం దాతలెవరైనా సాయం చేయాలని అభ్యర్థించాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

రామచంద్ర తెలుగులో దాదాపు 100 కు పైగా నటించాడు. ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్ కావడం విశేషం. మాస్ మహారాజ్ రవితేజ నటించిన వెంకీ చిత్రంలో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. రవితేజ స్నేహితుల్లో ఒకరిగా ఆయన పండించిన హాస్యం ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ మూవీలోని రైలులో కామెడీ సీన్స్ లో రామచంద్ర నటన అద్భుతమనే చెప్పాలి. ఆ తర్వాత దుబాయ్ శీను, సొంతం, ఆనందం, క్రాక్ తదితర చిత్రాలు ఆయనకు గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే కొంత కాలంగా ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెదడులో రక్తం గడ్డకట్టడం కారణంగా ఆయనకు పక్షవాతం వచ్చింది. దాంతో సంవత్సరం నుంచి కేవలం మంచానికే పరిమితం అవుతున్నాడు. ప్రస్తుతం ఓ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఫిజియోథెరపీ చికిత్స తీసుకుంటున్నాడు.

Ramachandra comedian health update See how Tollywood comedian has changed due to severe illness

గత సంవత్సరం కాలంగా ప్రతి నెలా ఆయన వైద్య చికిత్స కు రూ. 2లక్షల నుంచి రూ. 2.5 లక్షల ఖర్చు అవుతుంది. దాంతో రామచంద్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో చేతిలో డబ్బులు అయిపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. దాతలు సాయం చేయాలని కోరుతున్నాడు. ఇక ఇప్పటికే సినీ పరిశ్రమలోని కొందరు ప్రముఖులు సాయం చేసినట్లు సమాచారం. కానీ చికిత్స మరికొన్ని నెలలు ఉండటంతో ఎవరైనా దాతలు సాయం చేయాలని ఆయన సోదరుడు కోరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+