మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న రవితేజ, శ్రీలీల..!
నటుడు రవితేజ, హీరోయిన్ శ్రీలీల మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. వీరిద్దరూ గతంలో ధమాకా సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజిపోయాడు. ఇప్పుడు ఆయన తన 75వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా సంబంధించిన పూజ కార్యక్రమం కూడా మంగళవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమయ్యింది. ప్రసుత్తం మాస్ మహారాజా రవితేజ చేతిలో పలు బడా ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ మూవీ షూటింగ్‌లో ఉండగానే నటుడు రవితేజ మరో ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నాడు.
మిస్టర్ బచ్చన్ సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వం చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే రవితేజ మరో సినిమాకు ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం చేయనున్నారు. రవితేజ, శ్రీలీల కాంబోలో వచ్చిన ధమాకా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక, ఈ జోడి మళ్లీ తెరపై సందడి చేయనుందంటే అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమం హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది. వీటికి సంబంధించిన ఫోటోలను చిత్ర యూనిట్ నెట్టింట పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో శ్రీలీల చీరలో ఎంతో అందంగా ముస్తాబయ్యింది.

ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రవితేజకు ఇది 75వ సినిమా కావడంతో ఈ సినిమాను ప్రస్తుతానికి ఆర్టీ75గా పిలుస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియనుంది. నాగ వంశీకి చెందిన సితార ఎంటర్టైన్మెంట్స్, సాయి సౌజన్య ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ చిత్రానికి భీమ్ సీసిరోలియోనే సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఈయన గతంలో ధమాకాకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications