బిగ్ బ్రేకింగ్: ప్రభాస్ - పవన్ కల్యాణ్ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే?
డార్లింగ్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా చేస్తున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం ఉంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారతదేశంలోనే ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ చెలామణి అవుతున్నాడు. డార్లింగ్ ధాటికి సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటివారు కూడా వెనకబడిపోయారు. అంతగా బాలీవుడ్ లో డార్లింగ్ హవా సాగుతోంది.
బ్లాక్ బస్టర్ అవుతుంది..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మొన్నటివరకు ఎన్నికల ప్రచారంలో అలసిపోయిన పవన్ హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను పూర్తిచేయాల్సి ఉంది. ఓజీ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించాడు. పవన్ కల్యాణ్ కు మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఓజీ. దీన్ని అత్యంత జాగ్రత్తగా సుజిత తీర్చిదిద్దుతున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుజిత్ మాట్లాడుతూ ప్రభాస్ కు, పవన్ కల్యాణ్ కు సరిపడే కథను తయారు చేస్తున్నానని, వీరిద్దరినీ సంయుక్తంగా తెరపై చూపిస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా రాబడుతుందన్నారు. అవకాశం దొరకితే వెంటనే వీరిద్దరితో సినిమా చేస్తానన్నాడు.

మొదటిసారి పాన్ ఇండియా సినిమా
సుజిత్ ప్రభాస్ తో సాహో చేశాడు. మిగతా భాషల్లో యావరేజ్ గా నిలిచినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా ఘనవిజయం సాధించింది. పవన్ కల్యాణ్ తో ప్రస్తుతం ఓజీ చేస్తున్నాడు. దీనిపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ కూడా తనను తాను పాన్ ఇండియా హీరోగా తీర్చిదిద్దుకునే క్రమంలోనే ఈ కథను ఎంచుకున్నారు. దాదాపు 60 శాతం షూటింగ్ కూడా పూర్తయింది. ఎన్నికలు కూడా పూర్తికావడంతో త్వరలోనే పవర్ స్టార్ ఓజీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. దీనికి డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications