పవన్ కల్యాణ్‌పై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్.. ఏం మాట్లాడిన తప్పే అంటూ వార్నింగ్
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో తెలుగు మీడియాలో ఎక్కువుగా కనిపిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే రేణు దేశాయ్ ఇప్పుడు తరచూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది.
రేణు దేశాయ్ చాలాకాలం తరువాత తెలుగు సినిమాలో నటించింది. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది. రవితేజ హీరోగా తాజాగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ తన మాజీ భర్త పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. రేణు దేశాయ్ మాట్లాడుతూ.. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం వారితో నేను చాలా సరదాగా గడుపుతాను అని చెప్పుకొచ్చింది.

ఇక నా కెరీర్ గురించి నేను ఆలోచించను. ప్రతి ఒకరి రిలేషన్ షిప్‌లో కష్ట, సుఖలుంటాయి. నేను ఏమీ స్పెషల్ కాదు, నా ఒక్కదానికి మాత్రమే కష్టాలు లేవు అంటూ తెలిపింది. అలాగే పవన్ కళ్యాణ్ గురించి నన్ను ఏం అడుగొద్దు. ఎందుకంటే ఆయన గురించి ఏమీ మాట్లాడినా దానిని తప్పుగానే రాస్తున్నారంటూ మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. నేను ఒకటి చెపితే, ఆ ఇంపార్టెంట్ వదిలేసి, చిన్న చిన్న విషయాలను వైరల్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.ఇక మీదట తాను పవన్ కల్యాణ్ గురించి ఏం మాట్లాడదలుచుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. పవన్‌పై రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications