విజయ్ దేవరకొండతో ప్రేమకథకు సిద్ధమవుతున్న సాయిపల్లవి..
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి అంటే యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. సాయిపల్లవి సినిమా అంటే ఓ మంచి కథ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. తన అందం, నటన డ్యాన్సుతో తెలుగు అభిమానులకు మరింత దగ్గరయ్యింది ఈ అమ్మడు. ప్రేమమ్ చిత్రంతో కుర్రకారును ఎంతోగానో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. తెలుగులో తన మొదటి చిత్రం ఫిదాతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలోని తన నటన, అందం, నృత్యానికి ప్రేక్షకులకు ఫిదా అయిపోయారు. ఎక్స్‌పోజింగ్ అమడ దూరంలో ఉంటూ..
అచ్చం తెలుగింటి ఆడపడుచులా తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగులో సాయిపల్లవి నటించింది తక్కువ సినిమాలే అయినా.. అన్నీ గుర్తుండిపోయే చిత్రాలే చేసింది. సాయిపల్లవి ఎక్కువగా ప్రేమకథల్లోనే కనిపించింది. ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ వంటి చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం నాగచైతన్యతో తండేల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే మరో ప్రేమకథకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అది కూడా రౌడీ బాయ్ విజయ్‌దేవరకొండతో ప్రేమకథకు సిద్ధమయినట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దర్శకుడు రవికిరణ్ కోలా హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఓ సినిమా తీయబోతున్నారు. ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది ఒక అందమైన ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోబోతుందట. అయితే, ఈ సినిమాలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన సాయిపల్లవిని తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిసాయని, అందుకు ఆమె ఒకే చెప్పినట్లు కూడా సమాచారం. ఇక, ఈ ప్రేమకథా చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే, ఈ విషయంపై అటు సాయిపల్లవి కానీ, చిత్ర యూనిట్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వార్తలో వాస్తవమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో తండేల్, తమిళంలో అమరన్‌లో సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నారు. వీటితో పాటు బాలీవుడ్‌లో కూడా రెండు భారీ ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications