అల్లు అర్జున్‌తో నటించొద్దని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు..సమంత సంచలన కామెంట్స్
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.
విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అసలు వీరిద్దరు ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పటి వరకు బయటపెట్టలేదు. అయితే తాజాగా సమంత చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

దీనిపై సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..పుష్ప చిత్రంలో ఊ అంటావా మావ ఐటెం సాంగ్ చేయవద్దని పెద్ద ఎత్తున నాపై ఒత్తిడి చేశారని.. కుటుంబ సభ్యులు, నా సన్నిహితులు ఇటువంటి ఐటం సాంగ్స్‌లో నటించడం వల్ల కెరీర్ క్లోజ్ అవుతుందని హెచ్చరించారట. విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నా సమయంలో పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందట.
కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఇలాంటి పాట చేస్తే విమర్శలు ఎక్కువవుతాయని.. వద్దని చెప్పారట. అందరు అనుకున్నట్టే ఊ అంటావా మావ ఐటెం సాంగ్ చేయడం పట్ల కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఐటెం సాంగ్ చేయకుండా ఉండేందుకు నాకు ఎలాంటి కారణాలు కనిపించలేదు. అలాంటప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలనుకుని ఆ సాంగ్‌లో నటించానని సమంత చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications