నాగచైతన్య గుర్తులని పూర్తిగా చెరిపేస్తున్న సామ్.. షాకింగ్ వీడియో పోస్ట్ !
"సమంత".. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సామ్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అక్కినేని నాగ చైతన్య సరసన "ఏ మాయ చేసావే" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. స్టార్ హీరోలు అందరి సరసన నటించింది.
అయితే నాగ చైతన్యతో విడాకుల తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ కంటే కూడా పర్సనల్ లైఫ్ విషయాలతోనే సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ఆమె కారణంగానే విడాకులు జరిగాయి అంటూ పలు పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత ఆమె అనారోగ్యం కారణంగా సినిమాలకు కొంచెం గ్యాప్ ఇవ్వడం.. తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇక రీసెంట్ గానే నాగ చైతన్య మళ్లీ వివాహం చేసుకోగా.. సామ్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమోరుతో రిలేషన్ లో ఉన్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇక నటిగా, నిర్మాతగానే కాకుండా పలు బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తూ ఫుల్ బిజీగా జీవితాన్ని గడుపుతున్నారు సమంత. 'సీక్రెట్ ఆల్కమిస్ట్' సంస్థ ప్రమోషన్‌లో భాగంగా లేటెస్ట్ గా ఆమె పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 'నథింగ్ టు హైడ్' అంటూ ఆ విడివలో రాస్తూ వెనక్కి తిరిగి నడిచి వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ నడిచే వెళ్లేటప్పుడు సమంత పైనే నెటిజన్లు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
గుర్తులు చెరిగిపోయాయా..?
తన తొలి చిత్రానికి గుర్తుగా సమంత తన మెడపై " వైఎంసీ " (ఏమాయ చేసావె) అనే పచ్చబొట్టు వేయించుకున్నారు. ఇది తనకెంతో ప్రత్యేకమని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె మెడపై టాటూ కనిపించకపోవడంతో ఆ టాటూను సమంత తొలగించేశారా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె నాగ చైతన్యతో ఉన్న గుర్తులని పూర్తిగా చెరిపేస్తున్నారని చర్చ నడుస్తోంది. మరోవైపు మేకప్‌తో అది కనిపించకుండా కవర్ చేసి ఉండొచ్చని మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. రాజ్, డీకే దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కిస్తుండగా.. ఆదిత్య రాయ్ కపూర్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. అలానే ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications