ఆ లీడర్‌తో బయటపడ్డ తెలుగు హీరోయిన్ లింక్..? ఫోన్ ట్యాపింగ్‌తో మ్యాటర్ మొత్తం లీక్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. గత తెలంగాణ ప్రభుత్వంలోని అధికారులు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు ఇప్పుటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులకు సంచలన విషయాలను వెల్లడించారని తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ప్రముఖ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా ప్రణీత్ రావు అంగీకరించినట్టుగా సమాచారం అందుతోంది. రియాల్టర్లు, సినీ ప్రముఖుల ఫోన్ నెంబర్ల సైతం ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడటంతో మొత్తం ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్టు అధికారులు గుర్తించారు. ఇక హైదరాబాద్‌లోని ప్రముఖ బిజినెస్ మ్యాన్లతో పాటు, రియాల్టర్ల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి.

ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని కూడా తాకిన సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువగా హీరోయిన్ల నెంబర్లే ఉండటం సంచలనం సృష్టిస్తోంది. వీరితో పాటు ప్రముఖ యాంకర్ల ఫోన్ నెంబర్లపై కూడా ట్యాపింగ్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైకి వెళ్లిన ఓ ప్రముఖ హీరోయిన్ నెంబర్‌ను సైతం హ్యాక్ చేసినట్టుగా తెలుస్తోంది.
తాజాగా ఓ తెలుగు హీరోయిన్ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్‌తో బయటకొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఓ రాజకీయ నాయకుడితో హీరోయిన్ సన్నిహితంగా మాట్లాడిన కాల్‌ను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది.ఈ సంఘటనకు కారణమైన ఒక నాయకుడిని లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరీ ఇంత కరువులో ఉన్నావేంటయ్యా.. పోయి పోయి ఈ అమ్మాయే దొరికిందా? అందుకే నీకు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అది ఓకే కానీ ఈవిడకు ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చావా లేక బలవంతం చేశావా ? అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications