మతం మారడానికి కూడా ఓకే.. కానీ ఆ కండిషన్ వల్లే ప్రభుదేవాతో పెళ్లి క్యాన్సిల్ !

లేడీ సూపర్ స్టార్ నయనతార.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాన్-ఇండియన్ హీరోయిన్. సినీరంగంలో అడుగుపెట్టి దాదాపు 22 ఏళ్లకు పైగా కావస్తున్నా నయనతార స్టార్ హీరోలకే పోటీనివ్వగలగిన స్థాయికి ఎదిగింది. క్లాసిక్ సినిమాలు, మాస్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అన్నింటిలోనూ తనకంటూ ప్రత్యేకతను చూపించింది. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా అడుగుపెట్టి కొన్ని వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది.

సినీ ఎంట్రీ..

తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోను నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2003లో మలయాళంలో 'మనసినక్కరే' సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టిన ఈ భామ.. 2005లో తమిళ చిత్రం 'అయ్యా' ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కాగా అదే ఏడాదిలో 'చంద్రముఖి' లో రజనీకాంత్ సరసన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించింది.

shocking-reasons-behind-actress-nayantara-and-prabu-deva-break-up

టాలీవుడ్‌లో ప్రయాణం..

ఇక తెలుగులో వెంకటేష్ సరసన 'లక్ష్మీ' చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జునతో 'బాస్'.. ప్రభాస్‌తో 'యోగి'.. రవితేజతో 'దుబాయ్ శీను'.. వెంకటేష్‌తో 'తులసి' వంటి పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలానే 2011లో బాలకృష్ణతో 'శ్రీరామరాజ్యం' అనే సినిమాలో సీతగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ పాత్రకు నంది అవార్డు సైతం గెలుచుకుంది. రానాతో 'కృష్ణం వందే జగద్గురుం', 'అనమిక' వంటి చిత్రాలలో ఆమె పాత్రలు ప్రత్యేకంగా నిలిచాయి.

గోల్డెన్ రీ ఎంట్రీ..

అయితే తెలుగులో కొంచెం గ్యాప్ తీసుకున్న నయనతార.. 2021 లో తిరిగి టాలీవుడ్‌లో మెరిసింది. బాలయ్యతో 'జై సింహా'.. మెగాస్టార్ తో 'సైరా నరసింహారెడ్డి', 'గాడ్ ఫాదర్' వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం చిరంజీవి - రావిపూడి సినిమాలో నటిస్తుంది. కన్నడ స్టార్ యశ్‌తో 'టాక్సిక్' చిత్రం లోనూ చేస్తుంది. అంతే కాకుండా డియర్ స్టూడెంట్స్', 'హాయ్', 'పెట్రియాట్', 'రక్కాయే', 'మూకుతి అమ్మన్ 2' వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది.

వివాహం..

2022లో నయనతార తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుంది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చినప్పటికీ, ఇటీవల పిల్లలతో కలిసి మురుగన్ ఆలయాన్ని దర్శించుకొని ఆ పుకార్లకు చెక్ పెట్టారు.

shocking-reasons-behind-actress-nayantara-and-prabu-deva-break-up

ప్రేమ వ్యవహారాలు..

నయనతార ప్రేమ జీవితంలో శింబు, ప్రభుదేవా వంటి ప్రముఖుల పేర్లు వినిపించాయి. అయితే ప్రభుదేవాతో ఉన్న సంబంధం చాలా పెద్ద వివాదంగా మారింది. ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి వరకు వెళ్లినా, చివరి నిమిషంలో అది రద్దు అయింది. కానీ కారణం ఏంటీ అనేది మాత్రం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ప్రభుదేవా పెళ్లికి చివరి నిమిషంలో నో చెప్పారని అంటున్నారు. క్రిస్టియన్‌గా ఉన్న నయన్‌ను మతం మారాలని, పెళ్లి తర్వాత సినిమాలు మానేయాల‌ని, పూర్తిగా ఇంటి పట్టునే ఉండాలని ప్రభుదేవా కండీషన్ పెట్టారట. కాగా అందుకు నయన్ అంగీకరించారని.. కానీ పెళ్లి తర్వాత మొదటి భార్య పిల్లలు వారితో ఉంటారని ప్రభుదేవా చెప్పడం‌తో పెళ్లి రద్దు అయినట్లు కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

మరోవైపు ప్రభుదేవాతో రిలేషన్‌పై పలుమార్లు నయనతార ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ కూడా చేశారు. అతని కోసం కెరీర్, కలలు, ఆశలు, సర్వస్వం వదులుకోవడానికి సిద్ధపడ్డానని.. అయితే బ్రేకప్ వల్ల తనకు మంచే జరిగిందని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+