ఏపీలోని ఈ అతి ప్రాచీన ఆలయం తెరచుకునేది మళ్లీ 8 నెలల తర్వాతే.. !!

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం రిజర్వాయర్ జలకళను సంతరించుకుంటోంది. దాదాపు డెడ్ స్టోరేజీకి పడిపోయిన ఈ ప్రాజెక్టుకు గత కొద్ది రోజులుగా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలానికి 1.52 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. కర్ణాటకలోని మలప్రభ, ఆలమట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో జూరాల మీదుగా శ్రీశైలానికి ప్రవాహం పెరిగింది.

ఆలమట్టి ప్రాజెక్టుకు 1.03 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1.11 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌కు 1.08 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.56 లక్షల క్యూసెక్కులు కాగా.. 1.52 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరంతా కూడా శ్రీశైలానికి చేరుకుంటోంది.

Krishna River Backwaters of Srisailam Reservoir Submerge Sri Sangameswara Temple in Nandyala

దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ రోజుకు 12 టీఎంసీలకు దాటింది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి జలాశయం నీటిమట్టం 849.70 అడుగులకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. వరద పెరుగుతున్నప్పటికీ కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ఇంకా ప్రారంభించలేదు. కృష్ణా బేసిన్‌లో వరద ఉధృతి భారీగా ఉన్నప్పటికీ, గోదావరి నదిలో మాత్రం ప్రవాహం స్వల్పంగా తగ్గింది.

ఉరవకొండలో తీవ్ర ఉద్రిక్తత- ఏం జరుగుతోంది
ఉరవకొండలో తీవ్ర ఉద్రిక్తత- ఏం జరుగుతోంది

కృష్ణానదికి భారీగా వరదనీరు చేరుకుంటోండటం వల్ల నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సంగమేశ్వరాలయం మరోసారి జలాధివాసానికి సిద్ధమైంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుండటంతో బ్యాక్‌వాటర్స్ ప్రభావంతో ఆలయ మూడొంతుల వరకు నీట మునిగింది. ఏటా జరిగే ఈ అద్భుత ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, పర్యాటకులు ఇక్కడికి భారీగా తరలివస్తోన్నారు.

అక్కడ అన్ని గేట్లు ఎత్తివేత- శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లు
అక్కడ అన్ని గేట్లు ఎత్తివేత- శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లు

సాధారణంగా శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం 841 అడుగులకు చేరుకోగానే సంగమేశ్వరాలయ గర్భగుడిలోకి వరద నీరు ప్రవేశిస్తుంది. ప్రస్తుతం నీటి మట్టం ఆ పరిమితిని దాటిపోవడంతో గర్భగుడి ఇప్పటికే నీట మునిగింది. గర్భగుడిలోని పంచనదీ సంగమేశ్వర లింగం పాదాల వరకు కృష్ణా నది నీరు తాకుతూ ప్రవహిస్తోంది. శ్రీశైలం నీటి మట్టం 867 అడుగులకు చేరుకుంటే ఈ శతాబ్దాల నాటి అద్భుత ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది.

ఏపీ వైపు..ఉరకలెత్తుతూ: శృంగేరి వద్ద తుంగా తాండవం- రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత
ఏపీ వైపు..ఉరకలెత్తుతూ: శృంగేరి వద్ద తుంగా తాండవం- రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత

ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లో ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే దేవాలయం పూర్తిగా అదృశ్యం అవుతుంది. దాదాపుగా ఎనిమిది నెలల సుదీర్ఘ కాలం పాటు ఈ ఆలయం నీటి అడుగునే ఉండిపోతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి మట్టం పూర్తిగా తగ్గే వరకు.. అంటే వచ్చే ఏడాది మే లేదా జూన్ నెల వరకు ఆలయం మళ్లీ కనిపించదు. అరుదైన వేపదారు శివలింగం రాబోయే కొన్ని రోజుల పాటు కృష్ణా నదిలోనే మునిగి ఉండనుంది. వరద నీటి ప్రవాహం తగ్గేవరకు ఈ ఆలయం భక్తులకు కనిపించదు.

సప్త నదుల కలయిక గల పవిత్ర ప్రదేశంలో వెలసిన ఈ ఆలయానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. పాండవుల కాలం నాటి విశిష్టమైన చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలోని వేప లింగాన్ని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ సంగమేశ్వరాలయం కృష్ణా నది బ్యాక్‌వాటర్స్‌లో పూర్తిగా మునిగిపోయింది. ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి విశేష హారతులు సమర్పించారు. నదీ దేవత ఆశీస్సులు కోరుతూ చీర, సారె, పసుపు, కుంకుమ వంటి పవిత్ర కానుకలను కృష్ణా ప్రవాహంలో వదిలారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+