'తులం బంగారం' పథకం అమలు ముహూర్తం, మార్గదర్శకాలు...!?
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం హామీ పైన అంచనాలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. కల్యాణలక్ష్మి పథకం స్థానంలో 'తులం బంగారం' పథకాన్ని అమలు చేసే విధంగా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. బడ్జెట్ అంచనాలతో పాటుగా అమలు మార్గదర్శకాల పైన వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయి నివేదిక పై చర్చించి తుది నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందు కోసం ముహూర్తం ఖరారైనట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ల కాలం పూర్తవుతోంది. ఈ క్రమంలోనే పెండింగ్ హామీల అమలుకు సిద్దం అవుతోంది. ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్ హామీ ఇచ్చిన తులం బంగారం అమలు పైన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో.. ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. ఈ పథకం అమలు దిశగా పూర్తి స్థాయి సమాచారం.. అంచనాలతో సమాయత్తం అవుతోంది. ఈ మేరకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే కల్యాణలక్ష్మి పథకం స్థానంలో 'తులం బంగారం' పథకాన్ని అమలు చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కల్యాణ లక్ష్మీ పథకంలో ఇప్పటివరకు ఆర్థిక సాయం రూపంలో నగదు అందజేస్తుండ గా, ఇకనుంచి పుస్తులు, మట్టెల రూపంలో నేరుగా బంగారాన్ని నిరుపేద ఆడబిడ్డలకు అందించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.

ప్రభుత్వం కసరత్తు
కాగా.. దసరా నుంచే ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగులు, పెన్షనర్లకు దసరా కానుకగా రెండు డీఏల (DA) ప్రకటన. వీటితో పాటు మహిళలకు బతుకమ్మ చీరలు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మరియు 2.5 లక్షల మందికి చేయూత పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు పెరిగేలా 'కేసీఆర్ కిట్' స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని సమాచారం. ఇక.. మరోవైపు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) తీవ్రంగా మండిపడుతోంది. దీంతో.. ఇప్పుడు తులం బంగారం పథకం పైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయం.. అర్హతల ఖరారు పైన ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications
