సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్.. 46 మందికి షోకాజ్ నోటీసులు!

విజయవాడలో ఇటీవల జరిగిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఆందోళనలో కీలక పాత్ర పోషించిన 46 మంది ఉద్యోగులను గుర్తించి, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యలు ఉద్యోగులను ఊహించని షాక్ కు గురి చేసింది..

పోలీసు వర్గాలు ఆందోళన సమయంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులను గుర్తించి, వారి పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించాయి. ఈ నివేదిక ఆధారంగా ఆ 46 మంది ఉద్యోగుల జాబితాను జిల్లా కలెక్టర్లకు పంపించారు. సోమవారం సాయంత్రంలోపు వారికి షోకాజ్ నోటీసులు పంపించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉండడంతో ఈ బాధ్యతను వారికి అప్పగించారు.

AP Govt shocking decision Serious on gram Secretariat Employees - Show Cause Notices to 46 employees

ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు పంపడం ప్రారంభించారు. నోటీసులకు ఉద్యోగులు ఇచ్చే వివరణను న్యాయనిపుణులతో కలిసి పరిశీలించి, తదనంతరం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆందోళనలో పాల్గొన్న 46 మందిలో ఇప్పటికే ఒకరిద్దరి ఉద్యోగులపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మరిన్ని చర్యలు రాబోతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు విజయవాడ పోలీసులు ఈ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం వచ్చిన వెంటనే కేసులు నమోదు చేయాలని భావిస్తున్నారు. ఆందోళన సమయంలో చట్టవిరుద్ధమైన చర్యలు, ప్రజా ఆస్తులకు నష్టం వంటివి జరిగితే కఠినచర్యలు తప్పవని అధికారులు స్పష్టంచేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలు, డిమాండ్లు తీర్చాలని ఆందోళనకు దిగినప్పటికీ, ప్రభుత్వం దీన్ని క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణిస్తోంది.

రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త.. విత్తనాలపై 75 శాతం సబ్సిడీ!
రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త.. విత్తనాలపై 75 శాతం సబ్సిడీ!

ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించకుండా ఆందోళనలో పాల్గొనడం సరికాదని అధికారులు భావిస్తున్నారు. షోకాజ్ నోటీసులకు సమాధానాలు రావడం, వాటిని పరిశీలించడం తర్వాత సస్పెన్షన్, ఇతర క్రమశిక్షణా చర్యలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ చర్యలు ఉద్యోగుల సంఘాల్లో మరిన్ని ప్రతిచర్యలకు దారితీయవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం క్రమశిక్షణను కాపాడుకోవడమే ప్రధానమని స్పష్టం చేస్తోంది. తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+