రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త.. విత్తనాలపై 75 శాతం సబ్సిడీ!
తెలంగాణలో రైతులకు శుభవార్త. తెలంగాణా రైతాంగ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రైతులు రబీ సీజన్‌కు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో సబ్సిడీ అందిస్తోంది. ఈ క్రమంలో రబీ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించామన్నారు.
రైతు నేస్తం 109వ ఎపిసోడ్లో ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. యాసంగి పంటల్లో తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి, తక్కువ కాలవ్యవధిలో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. నూనెగింజలు, పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని చెప్పారు. ఈ మేరకు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు.

విత్తనాలపై 50 నుంచి 75 శాతం వరకు సబ్సిడీ కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొన్ని ప్రత్యేక రకాల విత్తనాలకు 100 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. మొత్తంగా విత్తనాల సబ్సిడీకి రూ.52 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. 21 జిల్లాల్లో 29 వేల క్వింటాళ్లకు పైగా పప్పుధాన్యాల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
రబీ సీజన్లో రైతులు సరైన పంటలు ఎంచుకుని, నాణ్యమైన విత్తనాలు వాడితే మంచి దిగుబడి సాధించవచ్చని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని, రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విత్తనాల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ రైతులు గత కొన్ని సంవత్సరాలుగా రబీ పంటల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. ఈ రబీ సీజన్లో కూడా సబ్సిడీ విత్తనాలు, సాంకేతిక సలహాలు అందించడం ద్వారా రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మంత్రి ప్రారంభించిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వేగంగా కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications
