నాగచైతన్య: బుజ్జి బంగారం.. అంటూ శోభిత పోస్ట్
యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భాషలతో సంబంధం లేకుండా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. తాజా చిత్రం మంకీమ్యాన్ మంచి విజయాన్ని దక్కించుకుంది. సినిమాలతోపాటు వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తూ బిజీగా ఉంటోంది. అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ పోస్ట్ లు షేర్ చేస్తుంటుంది. కొద్దికాలంగా శోభిత.. అక్కినేని నాగచైతన్యతో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్లు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి లండన్‌లో ఓ రెస్టారెంట్‌లో కనిపించారు. దీంతో డేటింగ్ వార్తలు మరింత జోరందుకున్నాయి. తాజాగా శోభిత షేర్ చేసిన పోస్ట్ లో chai అని రాయడంతో వీరి రిలేషన్ నిజమే అని అందరూ నిర్థారించుకున్నారు. తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అనుకుంటున్నారు. అలాగే వీరిద్దరి రిలేషన్ కు సంబంధించి కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. తాజాగా శోభిత కొన్ని ఫొటోలు షేర్ చేయడంతోపాటు క్యాప్షన్ ఆసక్తికరంగా ఇచ్చింది.

శోభిత ఓ చిన్నపాపను ఎత్తుకొని ఉన్న ఫొటోలు షేర్ చేసింది. బుజ్జి బంగారం.. తార మిట్స్ తార అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరలవుతోంది. కొంతమంది నెటిజన్లు ఈ పాప అచ్చం శోభితలానే ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. నాగచైతన్య-శోభిత రిలేషన్ పై నాగచైతన్యను మీడియా ప్రశ్నించిన సమయంలో అటువంటిదేమీ లేదని కొట్టిపారేశారు. అటువంటి రూమర్లను నమ్మొద్దన్నారు. ప్రస్తుతం తాను కెరీర్ పై దృష్టి పెట్టానని, సినిమాలకు సంబంధించి ఏవైనా అప్ డేట్ కావాలంటే ఇస్తానని, అలా కాకుండా ఇటువంటి రూమర్లను పట్టుకొని ప్రశ్నిస్తే తన దగ్గర సమాధానం ఉండదని నాగచైతన్య స్పష్టం చేశారు. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది.












Click it and Unblock the Notifications